Mahindra Five-door Thar Launch Date & Expected Price: మారుతీ సుజుకి కంపెనీ జిమ్నీ (5-డోర్ వెర్షన్)ని జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో పరిచయం చేసింది. ఈ కారు బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. మారుతీ సుజుకి జిమ్నీకి కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. త్వరలో రోడ్లపై కనిపించనుంది. కానీ మహీంద్రా థార్ యొక్క 5-డోర్ల వెర్షన్ కూడా రాబోతుంది. కాబట్టి జిమ్నీకి గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం మహీంద్రా థార్ త్రీ-డోర్ వెర్షన్‌లో విక్రయించబడుతోంది. అయితే 5-డోర్ వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ కారు ప్రారంభానికి సంబంధించిన టైమ్‌లైన్ ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఏడాది మధ్యలో వచ్చే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ పొడవైన వీల్‌బేస్‌తో వస్తుంది. క్యాబిన్‌లో (ఇప్పటికే ఉన్న 3-డోర్ల థార్ కంటే) ఎక్కువ స్థలాన్ని పొందుతుంది. ఇది ప్రస్తుత 3-డోర్ మోడల్ కంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం 5-డోర్ల మహీంద్రా థార్ మెటల్ లేదా ప్లాస్టిక్ హార్డ్ టాప్‌ని కలిగి ఉంటుంది. సాఫ్ట్ టాప్ ఎంపికను తీసివేయవచ్చు. ఇది చంకియర్ స్పోక్స్‌తో అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. కొత్త రకాల సొగసైన సైడ్ స్టెప్స్‌ను కూడా ఉంటాయి. ఈ కారు మారుతి జిమ్నీకి పూర్తిగా పోటీగా ఉంటుంది.


మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ ప్రస్తుత పవర్‌ట్రెయిన్ ఎంపికలను మాత్రమే పొందే అవకాశం ఉంది. ఇది BS-6 ఫేజ్-2కి అనుగుణంగా ఉంటుంది. అయితే దీని పవర్‌ట్రెయిన్ ఎంపికలకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు. మహీంద్రా ఇటీవలే థార్ యొక్క RWD వెర్షన్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిని 5-డోర్ వెర్షన్‌లో కూడా కొనసాగించవచ్చు. అంటే కొత్త మహీంద్రా థార్ 5-డోర్ల 4X4లో మాత్రమే కాకుండా.. RWD సెటప్‌లో కూడా రావచ్చు. మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ ధర ఇంకా తెలియరాలేదు. 


Also Read: Man Kiss King Cobra Video: ఇదేం ఫాంటసీరా బాబు.. లవర్ కి పెట్టినట్టు కింగ్ కోబ్రాకి ముద్దు పెట్టేసాడు.. మెంటలెక్కిస్తున్న వీడియో


Also Read: Man Playing with King Cobra: అరేయ్ అది కింగ్ కోబ్రారా.. కుక్క కాదు.. 16 అడుగుల కింగ్ కోబ్రాతో ఫన్నీగా ఆడుకున్న వ్యక్తి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి