How To Make Upi Payment Without Internet: ప్రస్తుతం ఆన్‌లైన్ పేమెంట్స్‌ ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలిసిందే. కిరాణం కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఏ పేమెంట్ చేయలన్నా.. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారానే ఎక్కువగా చెల్లిస్తున్నారు. యూపీఐను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసింది. యూపీఐ యాక్టివేట్ చేసుకుంటే.. బ్యాంక్ వివరాలు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ అవసరం లేకుండా మొబైల్ ద్వారా తక్షణమే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అయితే ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్‌నెట్ ఉండాల్సిందే. కానీ ఆఫ్‌లైన్‌లో కూడా లావాదేవీలు చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూఎస్‌ఎస్‌డీ (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) కోడ్‌లను ఉపయోగించి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని ఎన్‌పీసీఐ తెలిపింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వివిధ సేవలను యాక్సెస్ చేయడానికి వినియోగదారులకు యూఎస్‌ఎస్‌డీ సహకరిస్తుంది. ఆఫ్‌లైన్‌లో డబ్బులు ఇలా పంపించండి.


==> బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి *99# డయల్ చేయండి.
==> వివిధ బ్యాంకింగ్ సేవల కోసం వివిధ ఆప్షన్లతో కూడిన మెనూ కనిపిస్తుంది. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి (ఆప్షన్ 3).
==> లబ్ధిదారుడి యూపీఐ ఐడీ లేదా వర్చువల్ చెల్లింపు చిరునామా (వీపీఏ)ని నమోదు చేసి.. సెండ్‌పై క్లిక్ చేయండి.
==> మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంటర్‌ చేసి.. సెండ్‌పై క్లిక్ చేయండి.
==> లావాదేవీని ప్రామాణీకరించడానికి మీ యూపీఐ పిన్‌ని ఎంటర్ చేయండి.
==> లావాదేవీ విజయవంతమైన తర్వాత మీరు కన్ఫర్మేషన్‌ వివరాలతో మీకు మెసేజ్ వస్తుంది.
==> యూపీఐ లావాదేవీ ఐఎస్ఎస్‌డీ పద్ధతిలో రోజువారీ లావాదేవీ పరిమితి రూ.5 వేలు మాత్రమే. అయితే ఈ సేవను ఉపయోగించేందుకు అదనపు ఛార్జీలు కూడా చెల్లించాల్సి రావచ్చు. ఈ సేవ ప్రస్తుతం ఎంపిక చేసిన బ్యాంకులకు మాత్రమే అందుబాటులో ఉంది.


Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. వారితో అక్రమ సంబంధాలు ఉన్నాయి: ఎంపీ అవినాష్ రెడ్డి
 
యూపీఐ ప్రధానంగా ఇంటర్‌నెట్ ఆధారంగా పని చేస్తుంది. మీ మొబైల్‌లో నెట్ కనెన్షన్ లేని సమయంలో ఆఫ్‌లైన్‌లో డబ్బులు పంపించేందుకు యూఎస్ఎస్‌డీ, QR కోడ్ పద్ధలు ఉపయోగించవచ్చు. వీటికి ఇంటర్‌నెట్ కనెక్షన్ అవసరం లేదు. అయితే ఈ పద్ధతులు డబ్బులు పంపించేందుకు లిమిట్ ఉంటుంది. అదేవిధంగా అన్ని బ్యాంకులకు అందుబాటులో ఉండదు.


Also Read: IPL 2023: గ్రౌండ్‌లో నితీష్‌ రాణా-హృతిక్ షోకీన్ ఫైట్‌.. మ్యాచ్ రిఫరీ ఆగ్రహం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook