MP YS Avinash Reddy Bail Petition in TS High Court: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో తనకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్లో అవినాష్ రెడ్డి ఆసక్తికరం అంశాలను ప్రస్తావించారు.
తనకు 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారని తెలిపారు అవినాష్ రెడ్డి. సీబీఐ అధికారులు ఇప్పటికే తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారని గుర్తుచేశారు. స్థానిక ఎమ్మెల్సీ ద్వారా వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీబీఐ ఆఫీసర్ కుమ్మక్కయ్యారని.. ఈ కేసులో తనను కుట్ర పన్ని ఇరికిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. కేవలం గూగుల్ టేకౌట్ ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ఈ కేసులో నిందితుడు దస్తగిరిని సీబీఐ ఢిల్లీకి పిలిపించి.. చాలా రోజులు తన వద్ద ఉంచుకుందని అవినాష్ రెడ్డి చెప్పారు. అక్కడే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారని.. ఈ కేసులో తనపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కటే ప్రాధాన్యంగా సీబీఐ తీసుకుందని అన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు తాను నిందితుడిగా లేనని.. 2021 సీబీఐ చార్జ్‌షీట్‌లో తనను అనుమానితుడిగా చేర్చారని గుర్తు చేశారు. తనపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ సునీతపై సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ. వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్యతో ఆర్థిక లావాదేవీలు జరుగుతుండటంతో సునీత కక్ష గట్టిందన్నారు. వివేకా కుమార్తె, సీబీఐ, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ప్రతిపక్ష నేతో కుట్ర పన్ని తనను, తన కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారని అన్నారు. వివేకానందరెడ్డికి రెండో భార్య ఉందని.. ఆమె కొడుక్కి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తానని వివేకా హామీ ఇచ్చారంటూ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ స్కూల్ పక్కన విల్లా కొనుగోలు చేసేందుకు కూడా వివేక భావించారని వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే సునీత కక్ష గట్టిందన్నారు.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. త్వరలోనే మరో డీఏ పెంపు..?
వివేకానందరెడ్డి చెక్ పవర్‌ను సునీత తొలగించడంతో.. ఆయన డబ్బు కోసం బెంగూళూరులో ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశారన్నారు. నిందితులతో కలిసి వివేకా డైమండ్స్ వ్యాపారం కూడా చేశారని.. ఇద్దరు నిందితుల కుటుంబ సభ్యులతో అక్రమ సంబంధాలు ఉన్నాయన్నారు. వివేకా రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ప్లాన్ తెలిసి వివేకానందరెడ్డితో సునీత గొడవ పడ్డారని.. ఆయన హత్యలో తనకు ఎలాంటి సంబంధించి లేదని అవినాష్ రెడ్డి పిటిషన్లో స్పష్టం చేశారు.
Also Read: IPL 2023: గ్రౌండ్లో నితీష్ రాణా-హృతిక్ షోకీన్ ఫైట్.. మ్యాచ్ రిఫరీ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook