UPI Transactions News: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా యూపీఐ ట్రాన్సాక్షన్స్ వినియోగమే ఎక్కువగా కనిపిస్తోంది. డిజిటల్ పేమెంట్స్ రాకతో క్యాష్ వినియోగం తగ్గిపోయింది.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయాయి. అయితే ఇప్పటివరకు మన దేశం లోపలే జరిగిన ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇకపై బార్డర్ దాటి వెళ్లనున్నాయి. అవును ఇకపై సింగపూర్‌లో ఉన్న మీ బంధుమిత్రులతో లేదా బిజినెస్ పార్టనర్స్‌తో ఇక్కడి నుంచే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే అక్కడి వాళ్లు ఇక్కడ ఉన్న వారికి కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారా నగదు పంపడం, రిసీవ్ చేసుకోవడం చేసుకోవచ్చు. ఈ మేరకు భారత ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశంలో యూపీఐ పేమెంట్స్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. మారుమూల పల్లెటూరు ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల వరకు.. టి కొట్టు నుంచి కార్ల షోరూం వరకు అంతటా యూపీఐ పేమెంట్స్ విరివిగా జరుగుతున్నాయి. యూపిఐ పేమెంట్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే.. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 74 బిలియన్ల యూపీఐ పేమెంట్స్ ద్వారా మొత్తం 126 ట్రిలియన్ల రూపాయల విలువైన నగదు చేతులు మారింది. ఈ వివరాలను ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా వెల్లడించారు.


వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సింగపూర్ ప్రధాని లీ హీన్ లూంగ్‌తో కలిసి రెండు దేశాల మధ్య యూపీఐ పేమెంట్స్ చేసుకునే గేట్‌వేను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. రాబోయే రోజుల్లో నగదు చెల్లింపుల కంటే యూపీఐ చెల్లింపులే అధికంగా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సిస్టం అభివృద్ధి చూసి ఇతర దేశాలు కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములు అవుతున్నాయి అని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం భారత సర్కారుతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడమే అందుకు నిదర్శనంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 


ఇండియాలో మనం యూపీఐ అని పిలుచుకుంటున్న విధానాన్ని సింగపూర్‌లో పే నౌ అని పిలుస్తారు. భారత్‌కి చెందిన యూపీఐ, సింగపూర్‌కి చెందిన పే నౌతో అనుసంధానం చేయడంతో ఇకపై ఈ రెండు వ్యవస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఇండియాలో ఒకరికొకరు ఎలాగైతే యూపీఐ పేమెంట్స్ చేసుకుంటున్నారో అంతే ఈజీగా సింగపూర్‌లో ఉన్న వాళ్లతోనూ చెల్లింపులు జరుపవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. సింగపూర్‌లో ఉంటున్న ఎన్నారైలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు.


ఇది కూడా చదవండి : Fake Passport Alert: పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం 


ఇది కూడా చదవండి : Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ


ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook