Facebook: ప్రపంచ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చెలాయిస్తుందనే ఆరోపణలు నిలువలేదు. అమెరికా ఫెడరల్ కోర్టులో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌కు భారీ ఊరట లభించింది. అసలేం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలో ప్రముఖ సంస్థలైన ఫేస్‌బుక్, అమెజాన్, ఆపిల్ కంపెనీలు యాంటీ ట్రస్టు బిల్లుల(Anti trust Bill)పేరిట విచారణ ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయనే ఆరోపణలపై ఈ బిల్లుల కింద అభియోగాలున్నాయి. ఈ కేసు విచారణ అమెరికాలోని ఫెడరల్ కోర్టులో జరుగుతోంది. గతంలో ఫేస్‌బుక్..ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లను బలవంతంగా కొనుగోలు చేసినందనే ఆరోపణపై ఫేస్‌బుక్ సంస్థపై యాంటీ ట్రస్ట్ కేసు నమోదైంది. 2012లో ఇన్‌స్టా‌గ్రామ్‌ను 1 బిలియన్ డాలర్లకు, వాట్సప్‌ను 2014లో 19 బిలియన్ డాలర్లకు ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. మార్కెట్‌లో ఫేస్‌బుక్ గుత్తాధిపత్యం చెలాయిస్తుందనే ఆరోపణల్ని ఎఫ్‌టీసీ..అమెరికా ఫెడరల్ కోర్టులో(Us Federal Court)నిరూపించలేకపోయింది. ఫలితంగా ఫేస్‌బుక్‌పై నమోదైన కేసును ఫెడరల్ కోర్టు కొట్టివేసింది.


యూఎస్ ఫెడరల్ కోర్టు తీర్పు వెలువడగానే..ఫేస్‌బుక్ (Facebook)షేర్లు 4 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. తొలిసారిగా ఫేస్‌బుక్ మార్కెట్ మూలధన విలువ 1 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఫెడరల్ కోర్టు కేసు కొట్టివేయడంతో ఫేస్‌బుక్‌కు భారీ ఊరట లభించినట్టైంది.


Also read: Gold Rate In Hyderabad 29 June 2021: బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook