Valentines Day 2023 Offers: వాలెండైన్స్ డే 2023 ఆఫర్స్.. ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు!
Offer and Discounts on iPhone 14, iPhone 14 Plus in Flipkart Valentine’s Day Sale 2023. వాలెంటైన్స్ డే 2023 సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది.
Offer and Discounts on iPhone 14, iPhone 14 Plus in Flipkart Valentine’s Day Sale 2023: 'వాలెండైన్స్ డే' 2023 మరో కొన్ని రోజుల్లో రానుంది. వాలెంటైన్స్ డేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకొంటారు. దాంతో ప్రేమికులు ఎప్పటినుంచో తెగ ప్లాన్స్ చేసుకుంటున్నారు. వాలెండైన్స్ డే రోజున ప్రేమించిన వ్యక్తితో ఎక్కడికి వెళ్లాలి, ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అలానే ప్రేమించిన వ్యక్తికి చాలా మంది ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ఓ అద్భుత ఆఫర్ ఉంది. వాలెండైన్స్ డే సందర్భంగా 'యాపిల్' ఐఫోన్లపై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి.
వాలెంటైన్స్ డే 2023 సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ 'వాలెంటైన్స్ డే సేల్' నడుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. రూ. 12,195 దాకా తగ్గింపు ఆఫర్ ఉంది. బ్యాంక్ కార్డ్‌లపై తక్షణ తగ్గింపుతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు అదనంగా రూ.4,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది.
'వాలెంటైన్స్ డే సేల్' సందర్భంగా ఐఫోన్ 14పై 6వేలు, ఐఫోన్ 14 ప్లస్‌పై 7వేల వరకు డిస్కౌంట్ ఉంది. ఐఫోన్ 14 ప్రస్తుతం రూ. 67,705లకే కొనుగోలు చేయవచ్చు. 2022 సెప్టెంబర్‌లో ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 79,900. అలానే ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 84,900లకు కొనేసుకోవచ్చు. 2022 సెప్టెంబర్‌లో ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 89,900.
'వాలెంటైన్స్ డే సేల్' సందర్భంగా ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా డిస్కౌంట్ ఉంది. రూ. 129,900తో లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రోను ఈ సేల్‌లో రూ. 1,25,400కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ. 139,900లు ఉండగా.. రూ. 1,35,400కే మీరు కొనేసుకోవచ్చు. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు ఉంటాయి. కేవలం ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లపైనే కాకుండా ఇతర ఉత్పత్తులపై కూడా తగ్గింపు ఉంది.
Also Read: IND vs AUS: రవీంద్ర జడేజా కాదు.. టీమిండియా ఫస్ట్ చాయిస్ ఆల్‌రౌండర్ అతడే: రవిశాస్త్రి
Also Read: KL Rahul Playing XI: టీమిండియా ప్లేయింగ్ 11 లీక్.. తొలి టెస్టులో బరిలోకి దిగే తుది జట్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.