Ravi Shastri says Ravindra Jadeja is not India First Choice All-Rounder: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. టీమిండియా ఫస్ట్ చాయిస్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అని, రవీంద్ర జడేజా కాదు అని అన్నాడు. మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని సూచించాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అతి ప్రణాళికలకు వెళ్లాల్సిన అవసరం లేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. దీర్ఘకాలంగా గాయంతో బాధపడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే.
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (వీసీఏ)లో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లలో ఒకరు మాత్రమే ప్లేయింగ్ 11లో ఉంటారని రవిశాస్త్రి అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'అక్షర్ పటేల్ కూడా రవీంద్ర జడేజా లాంటి ఆటగాడే. ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్లు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ మంచి ఇన్నింగ్స్‌లు ఆడతారు. ఒకే విధమైన నైపుణ్యాలను కలిగి ఉండటం వలన ఇద్దరిలో ఒకరే ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకుంటారు. ప్రస్తుతం టీమిండియా ఫస్ట్ చాయిస్ ఆల్‌రౌండర్ జడేజా కాదు' అని అన్నారు.
'రవిచంద్రన్ అశ్విన్ అతిగా ప్రణాళికలు రచించాల్సిన అవసరం లేదు. తన వ్యూహాలకు కట్టుబడి ఉంటే చాలు. సిరీస్ భవితవ్యాన్ని అశ్విన్ ఫామ్ నిర్ణయించే అవకాశం ఉంది. యాష్ మంచి ఆల్‌రౌండర్. జట్టుకు కీలకమైన పరుగులూ చేస్తాడు. అన్ని వేదికల్లో అశ్విన్ ప్రపంచ స్థాయి బౌలరే అయినా.. భారత పరిస్థితుల్లో అత్యంత ప్రమాదకారి. పిచ్ నుంచి సహకారం లభిస్తే.. బ్యాటర్లందరినీ ఇబ్బంది పెడతాడు. మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలి. తొలి రోజు బంతిని తిప్పగలిగేది అతడు మాత్రమే' అని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
ఆసియా కప్ 2022లో రవీంద్ర జడేజా కుడి మోకాలికి గాయమైంది. గాయానికి జడ్డూ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటినుంచి అతను నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉన్నాడు. భారత జట్టులోని అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో జడేజా ఒకడు. భారత్ తరపున 60 టెస్టుల్లో 24.71 సగటుతో 242 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 3 సెంచరీలతో 36.57 సగటుతో 2523 పరుగులు చేశాడు. జడేజా గాయంతో అక్షర్ పటేల్‌కు జట్టులో ఆడే అవకాశం లభించింది. అక్షర్ ఇటీవలి కాలంలో మూడు ఫార్మాట్లలో బాగా రాణిస్తున్నాడు. ఈ పరిస్థితిలో కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి ఎంపిక అక్షర్ కావొచ్చు.
Also Read: KL Rahul Playing XI: టీమిండియా ప్లేయింగ్ 11 లీక్.. తొలి టెస్టులో బరిలోకి దిగే తుది జట్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.