KL Rahul gives key hint on India vs Australia 1st Test Playing XI: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (వీసీఏ)లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. న్యూజీలాండ్ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ జట్టుత కలిశారు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరం కాగా.. వన్డే, టీ20ల్లో సెంచరీలు బాదిన శుబ్‌మన్ గిల్‌కి చోటు దక్కింది. అయితే తొలి టెస్టు నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం క్రీడావర్గాల్లో నడుస్తోంది.
భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11పై చిన్న హింట్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని పరోక్షంగా తెలిపాడు. తొలి టెస్ట్ నేపథ్యంలో కేఎల్ రాహుల్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓపెనింగ్ జోడీపై ప్రశ్నించగా.. 'నేను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటే.. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మిడిల్ ఆర్డర్‌లో ఆడేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాను' అని అన్నాడు. రాహుల్ ఇచ్చిన ఈ సమాధానాన్ని బట్టి ఈ సిరీస్‌లో రోహిత్ శర్మతో కలిసి గిల్ బరిలోకి దిగుతాడని స్పష్టమైంది.
భారత పిచ్‌లు ఎప్పుడూ స్పిన్నర్లకు చాలా ఉపయోగంగా ఉంటాయి. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోని పిచ్ కూడా స్పిన్నర్లకు ఎంతగానో సహకరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో కేఎల్ రాహుల్.. టీమిండియా ప్లేయింగ్ 11 గురించి స్పందించాడు. 'పిచ్ నేపథ్యంలో ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. తుది జట్టును ఇంకా నిర్ణయించలేదు. ఇంకా కొన్ని స్థానాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది' అని రాహుల్ తెలిపాడు. నాగ్‌పూర్ టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మరియు రవీంద్ర జడేజాలు స్పిన్ కోటాలో మొదటి రెండు మ్యాచ్‌లకు స్పిన్నర్లుగా ఎంపికయిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికె), ఇషాన్ కిషన్ (వికె), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), కేఎల్ భరత్ (కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
Also Read: TS Eamcet Exam 2023: మే 7 నుంచి ఎంసెట్ పరీక్షలు.. ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్ పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.