Vande Bharat Express Booking: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఛార్జీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. తక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఛార్జీలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ధరలను తగ్గిస్తే.. ఖాళీగా ఉన్న సీట్లకు కూడా ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్‌పూర్, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ మార్గాల మధ్య నడుస్తున్న వందే భారత్ రైళ్ల ఛార్జీలపై రైల్వే అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రైళ్లలో చాలా వరకు సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. గత నెల జూన్ వరకు భోపాల్-ఇండోర్ వందే భారత్ రైలులో 29 శాతం సీట్లు మాత్రమే నిండాయి. ఇండోర్-భోపాల్ రైలులో కేవలం 21 శాతం సీట్లు రిజర్వ్ అయ్యాయి. 70 శాతం రైలు ఖాళీగా ఉంటున్న తరుణంలో ఛార్జీలు తగ్గిస్తే.. వందే భారత్ రైలుకు ఆదరణ పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ఈ మార్గాల్లో మూడు గంటల పాటు ప్రయాణం ఉంటుండగా.. ఏసీ చైర్ కార్ ధర రూ.950, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర 1525 రూపాయలుగా ఉంది.


ప్రస్తుతం మన దేశంలో అత్యాధునిక వసతులతో అత్యంత వేగంగా నడిచే ట్రైన్ వందేభారత్. సుదీర్ఘ ప్రయాణం 10 గంటలు కాగా.. అతి తక్కువ ప్రయాణం 3 గంటలు. ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉండగా.. తక్కువ దూరం ప్రయాణించే రైళ్లపై ప్రయాణికులు ఆసక్తి చూపించడం లేదు. ఈ వందే భారత్ రైళ్లలో ఛార్జీలను తగ్గిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవ్వడంతో రైల్వే అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.   


ఇప్పటివరకు దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అత్యధికంగా కాసర్‌గోడ్-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ 183 శాతం బుకింగ్‌తో టాప్‌లో ఉంది. ఈ రైలుకు ప్రయాణికులు భారీగా ఆసక్తి చూపుతున్నారు. గాంధీనగర్-ముంబై సెంట్రల్, వారణాసి-న్యూఢిల్లీ, డెహ్రాడూన్-అమృతసర్, ముంబై-షోలాపూర్ మధ్య నడిచే వందే భారత్ రైళ్లు కూడా 100 శాతానికి పైగా బుకింగ్స్‌తో రన్ అవుతున్నాయి. తక్కువ డిమాండ్ ఉన్న రైళ్ల ఛార్జీలను తగ్గించి.. ప్రయాణికులను ఆకర్షించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.


Also Read: IND Vs WI T20 Squad: టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు


Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook