COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Volkswagen Taigun GT Line - GT Plus Sport: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ వోక్స్‌వ్యాగన్‌కి కూడా భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. దీనిని ఇలాగే కొనసాగించేందుకు కంపెనీ తమ పాపులర్ ఎస్‌యూవీ టైగన్‌ను రెండు విభిన్న వేరియంట్స్‌లో మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ రెండు ఎస్‌యూవీలు టైగన్ GT లైన్, GT ప్లస్ స్పోర్ట్ అనే పేర్లతో అందుబాటులోకి వచ్చాయి. అలాగే కంపెనీ వీటిని ప్రీమియం స్టోర్టీ లుక్‌లో విడుదల చేసింది. ఈ రెండింటిలో కంపెనీ ఇంటర్నల్‌, ఎక్స్టర్నల్‌ పరంగా అనేక కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అలాగే GT ప్లస్ స్పోర్ట్  టాప్‌ వేరియంట్‌ను కొనుగోలు చేసేవారి కంపెనీ బంఫర్‌ ఆఫర్స్‌ అందిస్తోంది. దీనిని కొనుగోలు చేసే కస్టమర్స్‌కి దాదాపు 4 సంవత్సరాల కాంప్లిమెంటరీ సర్వీస్ వాల్యూ ప్యాకేజీని కూడా అందించబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే వోక్స్‌వ్యాగన్ టైగన్ విడుదల చేసిన రెండు వేరియంట్స్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


GT లైన్ వేరియంట్ ఇంటీరియర్:
వోక్స్‌వ్యాగన్ టిగన్ GT లైన్ SUV కారు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంజన్‌ గరిష్టంగా 115బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే సమర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో పాటు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో సెటప్‌తో అందుబాటులోకి వచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు ఈ కారు 17 అంగుళాల క్యాసినో అల్లాయ్ వీల్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది బ్లాక్‌ ఫినిషింగ్‌తో కొత్త హెడ్‌లైట్లు, ఫ్రంట్‌ గ్రిల్‌ సెటప్‌తో రాబోతోంది. ఇక ఈ కార్ల డోర్లు, స్టీరింగ్ వీల్‌పై కాంట్రాస్ట్ గ్రే కలర్‌తో అందుబాటులోకి వచ్చింది. 


GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్:
వోక్స్‌వ్యాగన్ టిగన్ జిటి ప్లస్ స్పోర్ట్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది దీంతో పాటు ఇది గరిష్టంగా 150బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది 6-స్పీడ్ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే టాప్‌ వేరియంట్‌లో 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు వోక్స్‌వ్యాగన్ టిగన్ జిటి ప్లస్ స్పోర్ట్‌లో 19 కొత్త ఎక్స్‌టీరియర్, 15 ఇంటీరియర్ ఫీచర్స్‌ను కంపెనీ అందుబాటులో ఉంచింది. దీంతో పాటు వోక్స్‌వ్యాగన్ కంపెనీ రెండు వేరియంట్‌ల డెలివరీని ఈ నెలలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 



టాప్ వోక్స్‌వ్యాగన్ టిగన్ జిటి ప్లస్ ఫీచర్స్‌:
శక్తివంతమైన ఇంజన్:
1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్
150 హార్స్‌పవర్, 250 న్యూటన్ మీటర్ల టార్క్


అధునాతన ట్రాన్స్‌మిషన్:
7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
సున్నితమైన, స్పందించే గేర్ షిఫ్టింగ్


స్టైలిష్ డిజైన్:
స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకునే డిజైన్
LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు
17-అంగుళాల అల్లాయ్ వీల్‌లు


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫీచర్-రిచ్ ఇంటీరియర్:
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పానోరమిక్ సన్‌రూఫ్
సౌకర్యవంతమైన, విశాలమైన ప్రయాణ అనుభవం


అధునాతన భద్రతా ఫీచర్లు:
ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD మరియు ESP
రివర్స్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్
లీటర్‌కు 17 కి.మీ. వరకు ఇంధన సామర్థ్యం


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి