Vistara Airlines: విమాన ప్రయాణీకులకు శుభవార్త, ఆ విమానాల్లో ఇక వైఫై ఇంటర్నెట్
Vistara Airlines: విమాన ప్రయాణీకులకు శుభవార్త. ఇక విమానంలో కూడా ఇంటర్నెట్ ఎంజాయ్ చేయవచ్చు. విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రయాణీకులకు వైఫై ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vistara Airlines: దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్‌లైన్స్ కొన్ని ఎంపిక చేసిన విమానాల్లో వైఫై ఇంటర్నెట్ సౌకర్యం కాంప్లిమెంటరీగా అందించనుంది. క్లబ్ విస్తారా కార్యక్రమంలో భాగంగా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది.
విస్తారా ఎయిర్‌లైన్స్ ఇకపై తన ప్రయాణీకులకు విమానంలో కూడా వైఫై ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. ఈ మేరకు సంస్థ స్పష్టమైన ప్రకటన చేసింది. బోయింగ్ 787, ఎయిర్ బస్ ఏ321 వంటి ఎంపిక చేసిన నియో ఆపరేషనల్ అంతర్జాతీయ విమానాల్లో ప్రతి ప్రయాణీకుడికి వైఫై ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. తద్వారా ప్రయాణీకులు అంతర్జాతీయ ప్రయాణాల్లో విసుగు లేకుండా నచ్చినట్టుగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందవచ్చు. సభ్యత్వం ఎలాంటిది, రివార్డ్ పాయింట్లు, సభ్యుత్వ గడువు వంటి పరిమితుల్లేకుండా క్లబ్ విస్తారా సభ్యులందరికీ ఈ సౌకర్యం కల్పించనున్నట్టు సంస్థ తెలిపింది. అదే సమయంలో క్లబ్ విస్తారా సభ్యత్వం కోసం ఎలాంటి అదనపు రుసుము ఉండదని స్పష్టం చేసింది.
ఈ సర్వీస్ ప్యాకేజ్‌లో అన్‌లిమిటెడ్ డేటా అందించనుంది. బిజినెస్ క్లాస్ ప్రయాణీకులు, ప్లాటినం సభ్యులకు అదనంగా 50 ఎంబీ డేటా ఇవ్వనుంది. అదనంగా ఇచ్చే డేటాను వెబ్ బ్రౌజింగ్, సోషల్ మీడియా వేదికలు, మెయిల్ వంటివాటికి ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు ప్రయోజనాల్ని పొందేందుకు ప్లాటినం సభ్యులు 50 ఎంబీ సర్ఫ్ ప్యాకేజ్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్యాకేజ్ ద్వారా ప్రయాణీకులు అంతరాయం లేని ఇంటర్నెట్ అనుభూతిని పొందవచ్చు.
క్లబ్ విస్తారా సభ్యత్వం కోసం ఏం చేయాలి
క్లబ్ విస్తారా సభ్యుడిగా ఎవరికైనా నేరుగా యాక్సెస్ ఇవ్వచ్చు. www.airvistara.com, విస్తారా మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. క్లబ్ విస్తారా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైనా సరే సులభంగా చేరవచ్చు. 2-18 ఏళ్లలోపు మైనర్ అయితే రిజిస్ట్రేషన్ సమయంలో పేరెంట్ లేదా లీగల్ గార్డియన్‌ను చేర్చాల్సి ఉంటుంది. ఎన్‌రోల్ ఛైల్డ్/మైనర్ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
Also read: Diwali Top Shares: ఈసారి దీపావళికి ఎలాంటి షేర్లు కొంటే మంచిది, టాప్ 10 షేర్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook