Diwali Top Shares: షేర్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి షేర్ విలువ ఆకాశాన్నంటుతుంటే, ఒక్కోసారి కిందకు పడిపోతుంటుంది. అందుకే షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టెముందు చాలా పరిశీలన అవసరమౌతాయి.
Diwali Top Shares: ప్రస్తుతం దీపావళి సమీపిస్తోంది. మార్కెట్‌లో చాలా షేర్లు అందుబాటులో ఉన్నాయి. దీపావళికి చాలామంది షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. కొన్ని స్టాక్స్ దీర్ఘకాలంలో అత్యధిక రిటర్న్స్ సాధించే అవకాశముంది. ఆ షేర్ల వివరాలు తెలుసుకుందాం..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 78-90 కాగా టార్గెట్ ప్రైస్ 103 ఉంది. కల్పతరు ప్రోజెక్ట్స్ ఇంటర్నేషనల్ 580-660 రూపాయలుంది. టార్గెట్ ప్రైస్ 795గా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2075 కాగా టార్గెట్ ప్రైస్ 2695గా ఉంది. యునైటెడ్ స్పిరిట్స్ 915-1040 కాగా టార్గెట్ ప్రైస్ 1195 వరకూ ఉంది.
గోద్రెజ్ ఇండస్ట్రీస్ షేర్ 555-624 మధ్య ఉంది. టార్గెట్ 735 వరకూ ఉంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్ 1700-1925 రూపాయలైతే టార్గెట్ ప్రైస్ 2275 ఉంది. గుజరాత్ అల్కలైస్ అండ్ కెమికల్స్ షేర్ 638-718 వరకూ ఉంది. టార్గెట్ ప్రైస్ 875.
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సూచిస్తున్న పది షేర్లలో డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ 4850-5400 మధ్య ఉంది. 6250 వరకూ పెరగవచ్చు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ 82-92 మధ్య ఉంది. 112 వరకూ టార్గెట్ ఉంది గెయిల్ 106-120 మధ్య ఉంది. 140 వరకూ టార్గెట్ ఉంది.
షేర్ మార్కెట్‌పై ఆసక్తి ఉండేవారికి షేర్ బ్రోకరేజ్ సంస్థలు ఏవి మంచివి ఏవి కావనేది సూచిస్తుంటాయి. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ద్వారా మంచి ఫలితాల్ని ఇవ్వవచ్చు. అయితే దీర్ఘకాలం ఉంచాల్సి వస్తుంది.
దీపావళి సందర్భంగా చాలామంది బంగారం, వెండిపై పెట్టుబడి పెడుతుంటారు. ఇంకొంతమంది షేర్ మార్కెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీర్ఘకాలంలో లాభాల్ని అందించే కంపెనీ షేర్లపై ఆసక్తి ఉంటుంది.