Vodafone Idea Plan: వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు షాకింగ్ న్యూస్! పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ కస్టమర్లకు అందించే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కాలపరిమితిని ఇకపై తగ్గించనున్నట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. గతంలో ఎయిర్ టెల్ నెట్ వర్క్ కూడా తమ పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో అందించే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ చెల్లుబాటును కూడా తగ్గించింది. ఆ తర్వాత ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. మే నెల నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకపై 6 నెలలే అమెజాన్ ప్రైమ్ సభ్యతం..


కొత్తగా చేసిన మార్పుల ప్రకారం వొడాఫోన్ ఐడియా కంపెనీ.. ఏడాది పాటు ఇచ్చే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను ఇప్పటి నుంచి కేవలం 6 నెలల పాటు సభ్యత్వాన్ని పొందనున్నారు. అయితే వొడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ ప్లాన్ కస్టమర్లకు అందించే అదనపు ప్రయోజనాల చెల్లుబాటు వ్యవధిలో ఎలాంటి మార్పులు చేయలేదు. 


అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపు పెరగడమే కారణం..


అమెజాన్ ప్రైమ్ తమ సబ్‌స్క్రిప్షన్ ఫీజును పెంచుతున్నట్లు కొన్ని నెలల క్రితం ప్రకటించింది. అదే విధంగా దాన్ని అమలులోకి కూడా తీసుకొచ్చింది. గతంలో రూ. 999 ఉండే సబ్ స్క్రిప్షన్ ధర.. ఇప్పుడు రూ. 1,499 ధరకు పెంచింది. పెరిగిన ధరల కారణంగా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ వ్యాలిడిటీని తగ్గించినట్లు తెలుస్తోంది.  


Also Read: Realme GT 2 Offer: రూ.40 వేల విలువైన Realme స్మార్ట్ ఫోన్ ను రూ.17 వేలకే కొనండి!


Also Read: Flipkart Electronics Sale: రూ.19 వేలకే ఎయిర్ కండిషనర్.. నేడు ఆఫర్ చివరి రోజు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook