Electric scooters: దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ వార్డ్​విజార్డ్​ ఇన్నోవేషన్స్​ అండ్ మొబిలిటీ.. రెండు కొత్త హైస్పీడ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లను ఆవిష్కరించింది. వోల్ఫ్​+, నాను+ పేర్లతో ఈ స్కూటర్లను తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనితో పాటు. ఫ్లీట్​ మేనేజ్​మెంట్ ఎలక్ట్రిక్​ స్టూటర్​ డెల్​ గో అనే మరో మోడల్​ను ఆవిష్కరించింది. ఈ మూడూ హై స్పీడ్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్​లో ఈ మూడింటిని విడుదల చేసింది. డెల్ గో అనేది డెలివరీ వెహికిల్​గా, సరకు రవాణాకు ఉపయోగపడే విధంగా రూపొందించింది కంపెనీ.


డెల్‌ గో స్కూటర్‌ ధర రూ. 1,14,500గా నిర్ణయించింది కంపెనీ.


ఈ స్కూటర్లన్నింటిని గుజరాత్​లోని వడోదర ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు వార్డ్​విజార్డ్​ ఇన్నోవేషన్స్​ అండ్ మొబిలిటి తెలిపింది. ఈ మూడు స్కూటర్లకోసం దేశవ్యాప్తంగా కంపెనీ డీలర్​షిప్లలో బుకింగ్స్ కూడా​ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ స్కూటర్లన్నింటికి మూడు సంవత్సరాల వారంటీతో విక్రయించనున్నట్లు వెల్లడించింది.


వోల్ఫ్​+, నాను+ స్కూటర్ల గురించి..


వోల్ఫ్​+ విద్యుత్ స్కూటర్​..టౌరింగ్ డిజైన్​తో సిటీ ఔట్​స్కట్స్​లో నడిపించేందుకు అనుకూలంగా అభివృద్ధి చేశారు. ఇక నాను+ వేరియంట్​ను యువతను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేశారు.


వోల్ఫ్‌+ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ.1,10,185గా కంపెనీ నిర్ణయించింది.


వోల్ఫ్​+ ఎత్తైన, వైడల్పైన సీట్​తో అందుబాటులోకి తేనుంది. 740 ఎంఎఁ ఎత్తు, 134 ఎంఎం ఎక్స్​టెండెడ్ వీల్​ బేస్​తో ఇది అందుబాటులో ఉంటుంది.


నెక్ట్స్​ జెన్​ నాను+ సీటు ఎత్తు 730 ఎంఎం, వీల్​ బేస్​ 132 ఎంఎంగా ఉంటుంది.


నాను+ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధరను రూ. 1,06,991గా ఉంచింది కంపెనీ.


ముందు వైపు చక్రానికి  డ్యూయల్​ ఫోర్క్​ హైడ్రాలిక్ సస్పెన్షన్​. వెనక చక్రానికి మోనో షాక్ సర్పెన్షన్​ ఉంటుంది. కీలెస్​ స్టార్ట్​, స్టాప్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.


వీటితో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్లను అభివృద్ధి చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ల డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంబమవుతాయనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


Also read: Paytm cashback offer: రూ. 4 ట్రాన్స్‌ఫర్‌ చేయండి.. రూ. 100 క్యాష్‌బ్యాక్‌ పొందండి!


Also read: POCO A3 Pro 5G: రూ.17,999 విలువైన 5జీ స్మార్ట్​ఫోన్​ రూ.249కే సొంతం చేసుకోండిలా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook