POCO A3 Pro 5G: రూ.17,999 విలువైన 5జీ స్మార్ట్​ఫోన్​ రూ.249కే సొంతం చేసుకోండిలా..!

POCO A3 Pro 5G: షియోమీ సబ్​ బ్రాండ్ పొకొ ఏ3 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​పై అదిరే ఆఫర్ ఇస్తోంది ఫ్లిప్​కార్ట్. రూ.17,999గా ధర కలిగిన ఈ ఫోన్​ను రూ.250 కన్నా తక్కువకే సొంతం చేసుకునే ఆఫర్ తీసుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 02:49 PM IST
  • మార్కెట్లో మరో బడ్జెట్ 5జీ ఫోన్​
  • ఫ్లిప్​కార్ట్​లో భారీ డిస్కౌంట్​
  • ఆఫర్లన్నీ కలిపితే రూ.250 కన్నా తక్కువకే కొనే అవకాశం..
POCO A3 Pro 5G: రూ.17,999 విలువైన 5జీ స్మార్ట్​ఫోన్​ రూ.249కే సొంతం చేసుకోండిలా..!

POCO A3 Pro 5G: స్మార్ట్​ఫోన్ అంటే.. ఇప్పుడు 5జీ ఫీచర్​ కూడా తప్పకుండా ఉండాలనుకుంటారు ప్రతి ఒక్కరు. అయితే మార్కెట్లో 5జీ స్మార్ట్​ఫోన్లు చాలా ఎక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.

బడ్జెట్ ధరలో చాలా తక్కువ మోడళ్లు మాత్రమే 5జీ ఫీచర్​తో అందుబాటులో ఉన్నాయి. తాజాగా షియోమీ సబ్ బ్రాండ్ పొకొ ఓ కొత్త మోడల్​ను 5జీ వేరియంట్​తో విడుదల చేసింది. బడ్జెట్ రేంజ్​లో పొకొ ఏ3 ప్రో 5జీ పేరుతో స్మార్ట్​ఫోన్​ మార్కెట్లోకి వచ్చింది. దీని ధరను రూ.17,999గా ఉంచినప్పటికీ.. దీనిని కేవలం రూ.249కే దీనిని సొంతం చేసుకునే వీలు కల్పిస్తోంది ఫ్లిప్​కార్ట్.

ఆఫర్ పూర్తి వివరాలు ఇలా..

పొకొ ఎ3 ప్రో 5జీ ధరను రూ.17,999గా ఉన్నా.. ఫ్లిప్​కార్ట్​ పరిమిత ఆఫర్​ కింద దీనిపై 13 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీనితో ఫోన్ ధర రూ.15,499కి తగ్గింది.

ఇక బ్యాంక్ ఆఫర్​ ద్వారా మరో రూ.750 డిస్కౌంట్​ లభించనుంది. అయితే సిటీ బ్యాంక్ క్రెడిట్​, డెబిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనితో ఫోన్ ధర రూ.14,749కి దిగొస్తుంది.

ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద.. మీ దగ్గర ఉన్న పాత మొబైల్​ను రిటర్న్ ఇవ్వడం ద్వారా రూ.14,500 వరకు తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తిగా లభిస్తే.. ఈ ఫోన్ కేవలం రూ.249కే కొనొచ్చు.

నోట్​: ఎక్స్ఛేంజ్ విలువ అనేది మీరు రిటర్న్​ ఇచ్చే ఫోన్​ కండీషన్​, మోడల్​పై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ ఫోన్​ ధర అన్ని ఆఫర్లు కలిపిన తర్వాతే రూ.249కే దక్కే అవకాశముంది.

పొకొ ఎ3 ప్రో 5జీ ఫీచర్లు..

  • 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే
  • 6జీబీ ర్యామ్​- 128 జీబీ స్టోరేజ్​
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్​
  • వెనకవైపు మూడు కెమెరాలు (48 ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ)
  • 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ (18 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​)

Also read: Best CNG Cars: తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 సీఎన్జీ కార్లు ఇవే

Also read: Todays Gold Rate: స్థిరంగా బంగారం ధర, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News