Credit Card Bill Transfer: క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్.. దీని గురించి ఎప్పుడైనా విన్నారా ? క్రెడిట్ కార్డు ఉపయోగించే వారిలో చాలామందికి ఈ ఆప్షన్ గురించి తెలియదు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ గురించి చెప్పుకోవడం కంటే ముందుగా మీకు ఉదాహరణకు హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, పర్సనల్ లోన్ ట్రాన్స్‌ఫర్ గురించి తెలిసే ఉంటుంది. ఇంకా చెల్లించాల్సి ఉన్న హోమ్ లోన్ బ్యాలెన్స్ మొత్తాన్ని మరొక బ్యాంకుకు బదిలీ చేయడాన్ని హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ అంటుంటాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం హోమ్ లోన్ తీసుకున్న బ్యాంకు వసూలు చేస్తోన్న వడ్డీ రేటు శాతం ఎక్కువగా ఉండి ఇఎంఐ భారం పెరిగినప్పుడు.. అంతకంటే తక్కువ వడ్డీ రేటు అందించే మరొక బ్యాంకుకు హోమ్ లోన్ మొత్తాన్ని బదిలీ చేసుకోవడం ద్వారా వడ్డీ రేటు తగ్గించుకోవడం, తద్వారా ఇఎంఐ భారాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది. హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌లో ఉండే అడ్వాంటేజ్ అది.


హోమ్ లోన్ ఇఎంఐ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఎలాగైతే హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో.. క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కూడా అలాగే ఉపయోగించుకోవచ్చు.


క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండిగ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌తో ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా ?
క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌తో ఉన్న మరో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే.. నిర్ణీత డ్యూ డేట్ లోగా ఒక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతే.. ఆ గడువు తేదీ ముగిసేలోగా మీవద్ద ఉన్న మరో క్రెడిట్ కార్డుపైకి ఈ బిల్లును బదిలీ చేసుకోవచ్చు. 


ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఉదాహరణకు మీ వద్ద రెండు బ్యాంకులకు చెందిన రెండు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని అనుకోండి. అందులో A అనే బ్యాంకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపునకు చివరి తేదీ ఫిబ్రవరి 20 కాగా.. ఆలోగా మీరు బిల్లు చెల్లించలేనిపక్షంలో మీ వద్ద ఉన్న B అనే బ్యాంక్ క్రెడిట్ కార్డుపైకి మొదటి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఔట్‌స్టాండిగ్ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. తద్వారా A అనే బ్యాంకుకు చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లు బారి నుంచి రిలీఫ్ పొందవచ్చు. లేదంటే ఆ క్రెడిట్ కార్డు బిల్లుని నిర్ణీత గడువులోగా చెల్లించనందుకుగాను లేట్ ఫీజు, వడ్డీలు, వగైరాలు కలుపుకొని భారీ మొత్తంలోనే చిలుము వదిలించుకోవాల్సి ఉంటుంది. 


ఒకవేళ A క్రెడిట్ కార్డు బిల్లుని B క్రెడిట్ కార్డులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్టయితే.. అక్కడి నుంచి కనిష్టంగా 2 నెలల కాల పరిమితి నుంచి 6 నెలల కాలపరిమితిలోగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లును నిర్ణీత గడువులోగా చెల్లించలేని వాళ్లు కానీ లేదా మొదటి క్రెడిట్ కార్డుపై భారీ మొత్తంలో వడ్డీని వసూలు చేస్తున్నట్టయితే.. ఆ వడ్డీ భారం నుంచి ఉపశమనం పొందడం కోసం తక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తోన్న మరో బ్యాంకు క్రెడిట్ కార్డుకు ఇలా బ్యాలెన్స్ ఔట్‌స్టాండిగ్ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారు. ఆర్థికపరమైన అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుందా ? అయితే జీ తెలుగు న్యూస్ రెగ్యులర్‌గా చదువుతూ ఉండండి.


ఈ ఆసక్తికరమైన కథనం కూడా మిస్ కాకండి : OnePlus 10 Pro 5G Price: సూపర్ ఫీచర్స్ ఉన్న ఈ 5G ఫోన్ ధరపై రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్


ఈ ఆసక్తికరమైన కథనం కూడా మిస్ కాకండి : OnePlus 11 5G Phone: వాలెంటైన్స్‌ డే నాడే అమ్మకాలు ప్రారంభించిన వన్‌ప్లస్ 11 5G ఫోన్


ఈ ఆసక్తికరమైన కథనం కూడా మిస్ కాకండి : Hyundai verna 2023: కేవలం రూ. 25 వేలు చెల్లించి కొత్త హ్యూందాయ్ కారు బుక్ చేసుకోండి


ఈ ఆసక్తికరమైన కథనం కూడా మిస్ కాకండి : Tatkal Passport Rules : 3 రోజుల్లో తత్కాల్ పాస్‌పోర్ట్.. అప్లై చేసుకోండిలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook