Credit Card Payment: క్రెడిట్ కార్డు ఈఎంఐ చెల్లింపులో తప్పకుండా గుర్తుంచుకోవల్సిన విషయాలివే

Credit Card Payment: క్రెడిట్ కార్డు అనేది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో ఏ సందేహమూ లేదు. అయితే సరైన రీతిలో వినియోగించకపోతే నష్టాలు కొని తెచ్చుకోవల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2022, 05:17 PM IST
Credit Card Payment: క్రెడిట్ కార్డు ఈఎంఐ చెల్లింపులో తప్పకుండా గుర్తుంచుకోవల్సిన విషయాలివే

ఇటీవలి కాలంలో అంతా క్రెడిట్ కార్డు హవా నడుస్తోంది. వివిధ బ్యాంకులు కూడా పోటీ పడి క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు అందించే సౌకర్యాలు కూడా ఎక్కువే. క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా కొనుగోలు చేయడం, ఆ తరువాత ఆ నగదును ఈఎంఐల రూపంలో చెల్లిస్తుంటాం. క్రెడిట్ కార్డు మంచిదే కానీ సరైన రీతిలో వినియోగించకపోతే చాలా నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

చెల్లించాల్సిన మొత్తం డబ్బుల్ని ఈఎంఐలో మార్చినప్పుడు ప్రతి నెలా వాయిదాల్లో ఆ బకాయి చెల్లిస్తుంటాం. చాలాసార్లు వాయిదాలపై వడ్డీ కూడా చెల్లిస్తుంటాం. క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐలో చెల్లించేటప్పుడు కొన్ని కీలక విషయాల్ని గుర్తుంచుకోవాలి.

1. క్రెడిట్ కార్డు ఈఎంఐపై ప్రోసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునేముందే ఈ సూచన కన్పిస్తుంది. 

2. ప్రోసెసింగ్ ఫీజు కాకుండా క్రెడిట్ కార్డు ఈఎంఐ మొత్తంపై వడ్డీ వసూలు చేస్తుంది. చాలా ఈ కామర్స్ వేదికలు జీరో కాస్ట్ ఈఎంఐ కూడా ఇస్తుంటాయి. ఇందులో అదనంగా ఏ విధమైన డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వడ్డీ రేటు ఎంత ఉందనేది తెలుసుకోవాలి.

3. చెల్లించేముందు లేదా ఈఎంఐలో లావాదేవీలు మార్చేముందు క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ఎంత ఉందనేది తెలుసుకోవాలి. కావల్సిన క్రెడిట్ బ్యాలెన్స్ లేకుంటే ఈఎంఐ రిక్వస్ట్ రిజెక్ట్ అవుతుంది. 

4. మిగిలిన ఈఎంఐ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలనుకుంటే..దాన్ని ఫోర్ క్లోజర్ అంటారు. దీనిపై ఛార్జ్‌తో పాటు జీఎస్టీ ఉంటుంది. 

5. ఏదైనా ఈఎంఐ పేమెంట్ చేయకపోతే లేటు ఫీజు వసూలౌతుంది. దాంతోపాటు అదనంగా వడ్డీ కూడా వసూలు చేస్తారు. ఫలితంగా భారీగా నష్టం ఎదురౌతుంది. అదే విధంగా పేమెంట్ మిస్ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ కూడా పడిపోతుంది. 

Also read: Car Festival Offers: కారు కొనే ఆలోచన ఉందా..అక్టోబర్ 31 వరకే అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News