Whatsapp Channels: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా అధికారికంగా ఇండియాలో ఇటీవలే వాట్సప్ ఛానెల్స్ ప్రారంభించింది. ఈ ఫీచర్ ప్రకారం వాట్పప్ నుంచి నేరుగా అప్‌డేట్స్, సమాచారాన్ని యూజర్లు అందుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రకారం ఫోటోలు పంపించేందుకే కాకుండా లింక్స్, ఇన్‌ఫో, వీడియోలు పంపించేందుకు వీలవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే చాలామందికి వాట్సప్ ఛానెల్స్ ఫాలో కావడం, అన్‌ఫాలో కావడం ఎలాగనేది ఇంకా స్పష్టత లేదు. ఈ ఫీచర్ ఉపయోగాలేంటనేది కూడా తెలియకపోవచ్చు. వాట్సప్ అందిస్తున్న వివరాల ప్రకారం ఈ ఫీచర్ ఇప్పటికే రోల్ అవుట్ అయినా అందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు. వాట్సప్ ఛానెల్స్ జాయిన్ అయ్యేందుకు ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్ ఉంది.


వాట్సప్ ఛానెల్స్ ఫాలో కావడం ఎలా


ముందుగా మీ వాట్సప్ వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలి. తరవాత వాట్సప్ ఓపెన్ చేసి అప్‌డేట్స్ బటన్ క్లిక్ చేయాలి. ఇందులో ఫైండ్ ఛానెల్ ఎంచుకోవాలి. న్యూస్, కల్చర్ ఇలా వివిధ కేటగరీలకు చెందిన వాట్సప్ ఛానెల్ ఏదైతే మీరు ఫాలో కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా సెర్చ్ ఆప్షన్‌లో టైప్ చేసి ఎంచుకోవచ్చు. ఫాలో బటన్ నొక్కితే చాలు.


వాట్సప్ ఛానెల్ అన్‌ఫాలో ఎలా


వాట్సప్ ఛానెల్ ఓపెన్ చేసి మెనూలో మూడు చుక్కల ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో అన్‌ఫాలో ప్రెస్ చేసి కన్‌ఫామ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక ఆ ఛానెల్ అన్‌ఫాలో అయినట్టే.


Also read: EV Cars Market: త్వరలో ఈవీ కార్లతో క్యూ కట్టనున్న మారుతి, హ్యుండయ్, టాటా, మహీంద్రా



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook