Whats App: వాట్సాప్ సంచలన నిర్ణయం.. మెసేజ్ ఫార్వర్డ్ చేయడం ఇక నుంచి కుదరదు..!
ఇక పై ఫార్వర్డ్ సందేశాలను ఒకసారి ఒక గ్రూప్ లేదా వ్యక్తికి మాత్రమే ఫార్వర్డ్ చేయగలిగేలా సాంకేతికంగా మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులకు నష్టమేనని నిపుణులు అంటున్నారు.
Whats App Sensational Decision: మెసేజింగ్ యాప్‌లో ప్రాధనమై యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే ఇక పై ఫార్వర్డ్ సందేశాలను ఒకసారి ఒక గ్రూప్ లేదా వ్యక్తికి మాత్రమే ఫార్వర్డ్ చేయగలిగేలా సాంకేతికంగా మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులకు నష్టమేనని నిపుణులు అంటున్నారు. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో వెల్లడించింది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 22.2.7.2, ఐఫోన్ 22.7.0.76 వెర్షన్‌లో ఈ కొత్త రూల్‌ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.
వాబీటాఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక సందేశాన్ని ఒకటి కంటే ఎక్కువ గ్రూపులు లేదా వ్యక్తులకు త్వరలో ఫార్వర్డ్ చేయడం కుదరదని తెలిపింది. ఒకవేళ ఫార్వర్డ్ చేయాలనుకుంటే తిరిగి సందేశాన్ని ఎంచుకుని పంపాల్సి ఉంటుంది. అయితే.. సింగిల్ గ్రూప్ ఫార్వర్డ్ లిమిటేషన్‌ను కొన్ని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ నిబంధనలను మరికొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఇంకొన్ని రోజుల్లో అన్ని స్మార్ట్ మొబైల్‌లో వాట్సాప్ సందేశాలను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులు లేదా వ్యక్తులకు ఫార్వర్డ్ చేసే వీలు ఉండకపోవచ్చు అని వాబీటాఇన్ఫో వెల్లడించింది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకసారి ఐదుగురికి లేదా ఐదు గ్రూపులకు సందేశాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు.
Also Read: Petrol Price Today: భారీగా పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్ ధర రూ.120!
Also Read: Ricky Kej Grammy: గ్రామీ అవార్డు దక్కించుకున్న భారతీయ మ్యుజీషియన్.. ప్రధాని మోదీ అభినందనలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
pple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook