Ricky Kej Grammy: గ్రామీ అవార్డులు ప్రదానోత్సవం సోమవారం రాత్రి లాస్ వేగాస్ లోని ఎంజీఎం గ్రాండ్ మార్క్యూ బాల్ రూమ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచదేశాలకు చెందిన కంపోజర్లు విచ్చేశారు. సంగీత కళాకారులు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పురస్కారాన్ని భారతీయ మ్యుజీషియన్ రికీ కేజ్ ను వరించింది. ప్రముఖ అమెరికన్ కంపోజర్ రాజ్ లెజెండ్ స్టీవర్ట్ కోప్లాండ్ తో కలిసి రికీ కేజ్ కంపోజ్ చేసిన 'డివైన్ టైడ్స్'అనే ఆల్బమ్ కు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో ఈ ఆల్బమ్ ఎంపికైంది.
అమెరికాలో పుట్టిన రికీ కేజ్.. చాలా సంవత్సరాల క్రితమే ఇండియా వచ్చి సెటిల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అయితే రికీ కేజ్ గ్రామీ అవార్డును దక్కించుకోవడం తొలిసారి కాదు. ఇది అతడిని రెండో గ్రామీ అవార్డు. 2015లో స్టీవర్ట్ కోప్లాండ్‌తో కలిసి చేసిన 'విండ్స్ ఆఫ్ సంసార' ఆల్బమ్ రిక్కీకి మొదటి గ్రామీ పురస్కారాన్ని అందుకున్నాడు.
గ్రామీ గెలుచుకున్న సందర్భంగా రికీ కేజ్ 'నమస్తే' అంటూ భారతీయ పద్దతిలో అభివాదం చేశారు. ఆ తర్వాత రికీ కేజ్ మాట్లాడుతూ.. డివైన్ టైడ్స్ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు పొందడం చాలా ఆనందంగా ఉందని, ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
Congratulations for this remarkable feat and best wishes for your future endeavours! https://t.co/scBToyGCjL
— Narendra Modi (@narendramodi) April 4, 2022
భారతీయ మ్యూజీషయన్ రికీ కేజ్ గ్రామీ అవార్డు దక్కించుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా రికీ కేజ్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Mouni Roy Photos: పెళ్లి తర్వాత మరింత సన్నబడిన 'నాగిని' మౌనీరాయ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook