Whatsapp New Feature: వాట్సప్ మరో అద్భుమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడిక గ్రూప్స్‌లో ఎక్కువమందిని యాడ్ చేయవచ్చు. గతంలో ఉండే సంఖ్యను వాట్సప్ రెట్టింపు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌లో గ్రూప్ సభ్యుల సామర్ధ్యం పెరుగుతోంది. ఇక నుంచి వాట్సప్ గ్రూపుల్లో 512 మంది వరకూ సభ్యుల్ని యాడ్ చేయవచ్చు. గతంలో ఈ సంఖ్య 256గా ఉండేది. అంటే వాట్సప్ ఆ పరిమితిని రెట్టింపు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనిపై వాట్సప్ ప్రకటన చేసింది. దీంతోపాటు మెస్సేజ్ రియాక్షన్, వాయిస్ కాల్ కోసం కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్, గ్లోబల్ వాయిస్ నెట్ ప్లేయర్, ఇతర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.


ఈ ఫీచర్ ఎక్కువమంది యూజర్లకు అందుబాటులో రానుంది. ఒకవేళ మీకు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులో రాకపోయుంటే..రానున్న 24 గంటల్లో లభిస్తుంది. ఇది వెరిఫై చేసేందుకు కొత్త ఫీచర్ అందుబాటులో వస్తోంది. మీరు ఒక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంటే..స్క్రీన్ టాప్‌పై ఎంతమందిని యాడ్ చేయవచ్చో కన్పిస్తుంది. 


ఈ ఏడాది వాట్సప్ యూజర్ల కోసం మరో ఫీచర్ వస్తోంది. కొత్తగా కమ్యూనిటీ ఫీచర్ కూడా రోల్ అవుట్ కానుంది. గత కొద్దికాలంగా ఇది అభివృద్ధిలో ఉంది. వాట్సప్ గతంలోనే ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. కమ్యూనిటీ ఫీచర్ యూజర్లకు ఒకే గొడుగు కింద వేర్వేరు గ్రూప్స్ ఒకేసారి తీసుకొచ్చేందుకు అనుమతి ఇస్తుంది. ఇది అడ్మిన్స్‌కు చాలా గ్రూప్స్‌పై కంట్రోల్ ఉంచేందుకు అనుమతిస్తుంది. సభ్యులకు మొత్తం కమ్యూనిటీకి పంపించిన అప్‌డేట్ వర్తించేలా అనుమతి ఇస్తుంది. 


Also read: Flipkart End of Season Sale: ఎంఐ, థామ్సన్, శాంసంగ్ బ్రాండెడ్ టీవీలపై భారీ డిస్కౌంట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook