Whatsapp New Feature: వాట్సప్ కొత్త ఫీచర్, ఇక నుంటి డిలీటెడ్ మెస్సేజ్‌లు తిరిగి పొందే అవకాశం
Whatsapp New Feature: వాట్సప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకొచ్చే వాట్సప్..మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి యూజర్లకు కొత్త వెసులుబాటు కలుగుతుంది. ఆ వివరాలు మీ కోసం..
ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ప్రకారం ఇక నుంచి డీలీట్ చేసిన మెస్సేజ్‌లను కూడా తిరిగి రికవర్ చేసుకోవచ్చు. అదెలాగంటే..
వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. దీని ప్రకారం డిలీట్ ఫర్ మి చేసిన మెస్సేజ్‌లను కూడా తిరిగి అంటే 5 సెకన్ల వ్యవధిలో తిరిగి తెచ్చుకోవచ్చు. దీనికోసం వాట్సప్ కొత్తగా అన్‌డు ఫీచర్ ప్రవేశపెట్టింది. చాలా సందర్భాల్లో ఒకరికి పంపించాల్సింది మరొకరికి పంపించినప్పుడు డిలీట్ ఫర్ ఎవ్విర్‌వన్ చేస్తుంటాం. ఈ క్రమంలో పొరపాటున డిలీన్ ఫర్ మి చేస్తే మీ మెస్సేజ్ పోతుంది. ఈ పరిస్థితిని తొలగించేందుకే వాట్సప్ కొత్తగా అన్‌డు ఆప్షన్ పెట్టింది. పొరపాటున ఏదైనా మెస్సేజ్ డిలీట్ అయితే..అన్‌డు ఆప్షన్ ద్వారా తిరిగి ఆ మెస్సేజ్ పొందవచ్చు.
వాట్సప్‌లో డిలీట్ ఫర్ మి క్లిక్ చేసిన వెంటనే మెస్సేజ్ సహజంగానే డిలీట్ అవుతుంది. ఆ సందర్బంలో డిలీట్ ఫర్ మి పై మరోసారి క్లిక్ చేస్తే..యాక్సిడెంటల్ డిలీట్ అనే ఆప్షన్ కన్పిస్తుంది. అప్పుడక్కడ అన్‌డు క్లిక్ చేస్తే మీ డిలీటెడ్ మెస్సేజ్ కన్పిస్తుంది. ఆ తరువాత డిలీట్ ఫర్ ఎవ్విర్‌వన్ ప్రెస్ చేస్తే ఎవరికీ కన్పించదింక. అయితే ఈ కొత్త ఆప్షన్ కేవలం 5 సెకన్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇక మరో ఫీచర్ త్వరలో ప్రవేశపెట్టనుంది వాట్సప్.కెప్ట్ మెస్సేజెస్ పేరుతో మరో ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు డిసప్పియర్ ఫీచర్ ద్వారా మెస్సేజ్‌లను డిలీట్ కాకుండా సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది ఈ ఫీచర్.. త్వరలో అందుబాటులో రానుంది.
Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. డీఏ పెంపుతోపాటు మరో గుడ్‌న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook