Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. వాట్సప్ గ్రూప్‌లో ఉన్నా సరే..మీరు మీ నెంబర్ హైడ్ చేసుకునే అద్భుతమైన ఫీచర్ ఇది. ఎలాగో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్స్‌లో వాట్సప్‌ది అగ్రస్థానం. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లు అందించడం ఓ కారణమైతే..ప్రతి ఒక్కరూ సులభంగా వాడగలిగే యాప్ కావడం మరో కారణం. యూజర్ల కోసం ఇప్పటికీ కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూనే ఉంది. ఫలితంగా రోజురోజుకూ వాట్సప్ యూజర్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు వాట్సప్ మరో కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఈ ఫీచర్‌తో మీరు వాట్సప్ గ్రూప్‌లో ఉన్నా సరే..మీ నెంబర్ ఇతరులకు కన్పించకుండా హైడ్ చేసుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ..ఈ ఫీచర్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారనే విషయాలు తెలుసుకుందాం..


వాట్సప్ ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఇది యూజర్ల ప్రైవసీకు సంబంధించినది. మీరు ఏదైనా వాట్సప్ గ్రూపులో చేరినా..మీరు కోరుకుంటే మీ నెంబర్ కన్పించకుండా హైడ్ చేసుకునే ఫీచర్ ఇది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. 


WABetaInfo నివేదిక ప్రకారం వాట్సప్ తన యూజర్లకు ఈ కొత్త ఫీచర్ గురించి తెలిపింది. వాట్సప్ గ్రూపులో ఇతర సభ్యులకు మీ నెంబర్ కన్పించకుండా చేసే ఆప్షన్ ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించింది. అదే విధంగా కొంతమందికి మాత్రమే కన్పించేలా కూడా చేయవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ ఫీచర్..ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.22.17.23పై కన్పించనుంది. 


Also read: Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరో 48 గంటలు మాత్రమే, ఎలక్ట్రానిక్ నుంచి ఫ్లైట్ టికెట్ల వరకూ అద్భుతమైన రాయితీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook