Dish TV & Yes Bank: డిష్ టీవీ విషయంలో తన ఉచ్చులో తానే పడనున్న యస్ బ్యాంక్...
ప్రస్తుతం, యస్ బ్యాంక్ మరియు ప్రాక్సీ అడ్వైసరీ సంస్థ అయినట్టి ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (IiAS) ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్నలకు రెండు సంస్థలు ఇరుక్కుపోయాయి.
డిష్ టీవీకి వ్యతిరేకంగా యస్ బ్యాంక్ చేసిన కొన్ని వ్యతిరేఖ కదలికల కారణంగా ఇవి రెండు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాయి. డిష్ టీవీకి కొత్త డైరెక్టర్ ను నియమించలాని యస్ బ్యాంక్ ప్రతిపాదించగా మరియు SEBI స్కానర్‌లో ఉన్న ఒక వ్యక్తిని బహిర్గతంగా ఎంపిక చేయాలనీ సూచించింది యస్ బ్యాంక్ సూచించింది.
ప్రస్తుతం, యస్ బ్యాంక్ మరియు ప్రాక్సీ అడ్వైసరీ సంస్థ అయినట్టి ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (IiAS) ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్నలకు రెండు సంస్థలు ఇరుక్కుపోయాయి. రెండు సంస్థలు తీసుకున్న చర్యలు వాటి వెనుక దాగి ఉన్న ఉద్దేశ్యాల గురించి మార్కెట్ నుండి పెద్ద ఎత్తున తీవ్ర ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.
Also Read: Oil Purify Test: మీరు వాడే వంట నూనె నిజంగా స్వచ్చమైనదా..? ఇలా తెలుసుకోండి..!
వాటిలో కొన్ని ప్రశ్నలు ఏంటంటే..?? :-
-యస్ బ్యాంక్ ఎందుకు ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది? దీనికి IiAS ఎందుకు మద్దతు ఇచ్చింది?
-యస్ బ్యాంక్ మరియు IiAS ఇద్దరు పెట్టుబడి దారులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారా?
-యస్ బ్యాంక్ మరియు IiAS అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయా? - డిష్ టీవీని స్వాధీనం చేసుకోవాలనుకునే వారికి మద్దతుగా IiAS పనిచేస్తుందా?
-ఆర్థిక ఫలితాలను నిలిపివేయాలని IiAS తెలిపింది - ఈ చర్య వలన ఎవరికీ ప్రయోజనం? ఈ సలహా ఎందుకు ఇచ్చింది?
- నియంత్రణ చర్యను ఎదుర్కొన్న వ్యక్తిని నియమించాలనే యస్ బ్యాంక్ ప్రతిపాదనపై IiAS ఎందుకు మద్దతు తెలుపుతుంది?
-హక్కుల సమస్యతో ఉన్న సమస్యలేంటి? డబ్బు కంపెనీకి వెళ్తుందా? లేదా వ్యక్తుల జేబులోకి వెళ్తుందా? యస్ బ్యాంక్ ఉద్దేశం ఏమిటి?
-డిష్ టీవీ మేనేజ్మెంట్ మార్పు కోసం ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? మేనేజ్మెంట్ మార్పుతో యస్ బ్యాంకు ఏం సాధించాలనుకుంటుంది?
-యస్ బ్యాంక్ ప్రతిపాదించిన వ్యక్తులు DTH పరిశ్రమ అనుభవాన్ని కలిగి ఉన్నారా ?
Also Read: PM Modi's Birthday: వ్యాక్సిన్ పంపిణీ లో భారత్ రికార్డ్... 6 గంటల్లో కోటి వ్యాక్సిన్ డోసులు
డిష్ టీవీ విషయంలో యస్ బ్యాంక్ మరియు IiAS యొక్క కదలికలు మరియు ఉద్దేశాలపై అనేక అంశాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పెట్టుబడి దారుల మనస్సుల్లో సందేహాలను సృష్టించే ప్రణాళిక ఉన్నట్లు కనిపిస్తోంది, కానీ ఇలాంటి చర్యల వలన ప్రాక్సీ సంస్థకే విశ్వసనీయతను కోల్పోయేలా చేస్తుంది. ఈ కథనం ప్రచురించిన తరువాత వారి ప్రతిస్పందన కోసం జీ మీడియా యస్ బ్యాంక్ మరియు IiAS కి మెయిల్స్ పంపింది కానీ వారి దగ్గరి నుండి ఎలాంటి స్పందన రాకపోవటం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook