Bajaj CNG Bike: బజాజ్ కంపెనీ నుంచి మొట్టమొదటి సీఎన్జీ బైక్ త్వరలో లాంచ్ కానుంది. తొలుత జూన్ నెలలోనే లాంచ్ చేస్తామని కంపెనీ ప్రకటించినా సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. ఇప్పుడు లాంచింగ్ తేదీపై స్పష్టత వచ్చేసింది. జూలై 17న ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ లాంచ్‌కు సన్నాహాలు చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎన్జీలో ఇప్పటి వరకూ త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలే అందుబాటులో ఉన్నాయి. బైక్ ఇదే తొలిసారి. ఇప్పటికే లీకైన కొన్ని ఫోటోల ప్రకారం చూస్తుంటే బజాజ్ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైక్ స్టైలిష్ లుక్‌తో అలరించనుంది. ఇందులో సీఎన్జీతో పాటు పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది. స్లోపర్ ఇంజన్ డిజైన్‌తో సీఎన్జీ ట్యాంక్ ఏర్పాటైనట్టు తెలుస్తోంది. ఈ బైక్ 125 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. 5 గేర్ బాక్స్ ఉండటం మరో ప్రత్యేకత. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్‌కు కంపెనీ బజాజ్ బ్రూజర్‌గా నామకరణం చేసింది. సాధారణంగా వాహనాల్నించి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇతర వాహనాలతో పోలిస్తే ఇందులో 50 శాతం తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. 


ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే సమయంలో కాలుష్యం ముప్పు కూడా ఎక్కువగా ఉంటోంది. సీఎన్జీ బైక్‌పై బజాబ్ కంపెనీ ప్రకటన వచ్చినప్పట్నించి మార్కెట్‌లో ఈ బైక్‌పై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడు లాంచ్ అవుతుందా అనే నిరీక్షణ నెలకొంది. ఇప్పుడు లాంచ్ డేట్ నిర్ధారణ కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


బజాజ్ సీఎన్జీ బైక్‌లో రెండు స్టోరేజ్ సిలెండర్లు ఉంటాయి. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర 90 వేల వరకూ ఉండవచ్చు. ఈ బైక్‌లో హేలోజన్ లైట్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బి ఛార్జర్, ఎల్లోయ్ వీల్స్, సెల్ఫ్ స్టార్ట్, డ్యూయల్ షాకర్ రేర్ సస్సెన్షన్ వంటివి ఉన్నాయి. ఇక మైలేజ్ అయితే కేజీ సీఎన్జీకు 60-70 కిలోమీటర్లు రావచ్చని అంచనా ఉంది. 


Also read: Post Office Superhit Scheme: మీ డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ ఇదే, 5 లక్షలకు 10 లక్షలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook