Xiaomi Vertical AC: ఎండాకాలం కావడంతో ఏసీలకు డిమాండ్ అధికమైంది. అయితే ఇంట్లో ప్రతి గదిలోనూ ఏసీ అమర్చుకోవడం అందరికీ కాదు కదా..చాలామందికి సాధ్యం కాదు. బడ్జెట్‌తో కూడుకున్న వ్యవహారం. బెడ్రూంలో ఉంటే హాల్‌లో ఏసీ ఉండదు. హాల్‌లో ఉంటే మరో గదిలో ఉండకపోవచ్చు. ఒకే ఏసీ అన్ని చోట్లా ఉండటం సాధ్యం కాదు కదా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమస్యకు పరిష్కారంగానే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ చైనాకు చెందిన షియోమి కొత్తగా వెర్టికల్ ఎసీను మార్కెట్‌లో తీసుకొస్తోంది. ఇప్పటి వరకూ మనకు తెలిసి ఏసీలు రెండు రకాలు. విండో ఏసీ, స్ప్లిట్ ఏసీ. అత్యధికంగా వినియోగించేది స్ప్లిట్ ఏసీనే. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఎడారి దేశాల్లో విండో ఎసీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రెండు ఎసీలు గోడకు లేదా కిటికీకు అమర్చుకునేవే. వేరే గదిలో ఏసీ కావాలంటే మరో ఏసీ అమర్చుకోవల్సిందే. బడ్జెట్ దృష్ట్యా ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే చైనాకు చెందిన షియోమీ కంపెనీ కొత్తరకం ఏసీ విడుదల చేస్తోంది. ఇది వెర్టికల్ ఏసీ. 3 టన్నుల కెపాసిటీ కలిగిన ఏసీ ఇది. Xiaomi Mijia Air Conditioner Fresh Air Pro Dual Outlet పేరుతో మార్కెట్‌లో రానున్న ఈ ఏసీ టవర్ ఫ్యాన్‌లా పనిచేస్తుంది. 


ఇంట్లో ఎక్కడ కావలిస్తే అప్పుడు, ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. ఒకేచోట గోడకో లేదా కిటికీకో అమర్చాల్సిన అవసరం లేదు. డ్యూయల్ అవుట్ పుట్ కారణంగా చాలా త్వరగా కూలింగ్ అవుతుంది. 3 టన్నుల కెపాసిటీతో పనిచేసే ఈ ఏసీ 1930 వాట్స్ కూలింగ్ పవర్, 2680 వాట్స్ హీటింగ్ పవర్ కలిగి ఉంటుంది. విద్యుత్ ఆదా చేసే సామర్ధ్యం కూడా ఉండటంతో కరెంటు బిల్లు గురించి ఆందోళన అవసరం లేదు. 


షియోమి వెర్టికల్ ఏసీ ఆటోమేటిక్ కూలింగ్ ఎడ్జస్ట్‌మెంట్ కూడా ఉంటుంది. టైమర్ ప్రకారం లేదా కూలింగ్ ప్రకారం దానికదే ఆన్ లేదా ఆఫ్ అయ్యే సౌకర్యం ఉంది. ఈ నెలలోనే చైనాలో ముందుగా షియోమీ మిజియా డ్యూయల్ అవుట్‌పుట్ ఏసీ లాంచ్ కానుంది. ధర మాత్రం 1 లక్ష రూపాయల వరకూ ఉండవచ్చని అంచనా. 


Also read: Amazon Great Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభం, Oneplus 12, iPhone 15 proపై భారీ తగ్గింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook