Amazon Great Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభం, Oneplus 12, iPhone 15 proపై భారీ తగ్గింపు

Amazon Great Summer Sale 202 ప్రారంభమైపోయింది. వివిధ కంపెనీలకు చెందిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు చాలా తక్కువ ధరకు లభ్యమౌతున్నాయి. ఐఫోన్, వన్‌ప్లస్, షియోమి, శాంసంగ్ వంటి స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.

1 /5

Redmio Note 13 Pro Plus ఈ ఫోన్ జనవరి నెలలోనే లాంచ్ అయింది. అసలు ధర 33,999 రూపాయలు కాగా డిస్కౌంట్ అనంతరం 30, 999 రూపాయలకు లభిస్తోంది. ఐసీఐసీఐ, అమెజాన్ పే ద్వారా అదనంగా మరో 2946 రూపాయలు డిస్కౌంట్  అందుతోంది.

2 /5

Xiaomi 14 ఈ ఫోన్ గత నెలలోనే లాంచ్ అయింది. ఈ ఫోన్ అసలుధర 79,999 రూపాయలు కాగా దీనిపై నేరుగా 10 వేల రూపాయలు డిస్కౌంట్ ఉంది. దాంతో ఈ ఫోన్ ఇప్పుడు 69,999 రూపాయలకు లభించనుంది. ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, అమెజాన్ పే వినియోగిస్తే 4250 రూపాయలు అదనంగా తగ్గుతుంది. 

3 /5

OnePlus 12 వన్‌ప్లస్ కొత్త మోడల్ ఇది. అసలు ధర 64,999 రూపాయలు కాగా 3,249 రూపాయలు డిస్కౌంట్ అందుతోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ పోన్ ధర 61,750 రూపాయలైంది. 

4 /5

iPhone 15 Pro గత ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్ అయిన ఐఫోన్ 15 ప్రో అద్భుతమైన స్మార్ట్‌పోన్. ప్రస్తుతం ఈ ఫోన్‌పై 5 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దాంతో 1,34,900 రూపాయల స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 1,27,990 రూపాయలకు లభించనుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో 6,399 రూపాయలు తగ్గుతుంది. 

5 /5

ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం.  Amazon Great Summer Sale ఇవాళ మధ్యాహ్నం 12 గంటల్నించి ప్రారంభమైంది. ఈ సేల్‌లో OnePlus, iPhone 15 Pro, Xiaomi 14, OnePlus 12R ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.