ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనంపై ఆ సంస్థ కీలక ప్రకటన వెలువరించింది. మొదటి వాహనాన్ని మరో రెండేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ, చైనాకు చెందిన షియోమీ త్వరలో ఎలక్ట్రికల్ వాహనాల రంగంలో ప్రవేశిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎప్పుడు తొలి వాహనం మార్కెట్‌లో వస్తుందా అనేది ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో షియోమీ నుంచి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. 2024 తొలి అర్ధభాగంలో మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయనున్నామని షియోమీ వెల్లడించింది. దాంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన వివరాల్ని తెలిపింది. 


షియోమీ(Xiaomi)ఎలక్ట్రిక్ వాహనాల రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో మొత్తం 13 వేల 919 మంది పనిచేస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఇందులో 5 వందలమంది కేవలం ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టులో(Electric Car Project) పనిచేస్తున్నారని వెల్లడించింది. షియోమీ సంస్థ 2021 ఆగస్టులో డీప్ మోషన్ అనే స్టార్టప్ కొనుగోలు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలరంగంలో రానున్న పదేళ్లలో పది బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్టు షియోమీ తెలిపింది. షియోమీ తొలి ఈవీ కారు మార్కెట్‌లో వచ్చే సమయానికి ఇతర కంపెనీలైన యాపిల్, ఒప్పో, వివో, వన్‌ప్లస్‌లతో పోటీ పడే అవకాశముంది. షియోమీ కంపెనీ కార్లు ఉత్పత్తిని 2023లో ప్రారంభించి..2024లోగా మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. 


Also read: ADB loan to India: ఏడీబీ నుంచి భారత్​కు 300 మిలియన్ డాలర్ల రుణం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook