Government of India, ADB have signed a USD 300 million loan: భారత్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏబీడీ) మధ్య 300 మిలియన్ డాలర్ల రుణానికి ఒప్పందం కుదిరింది. మన కరెన్సీలో ఈ విలువ (ADB loan to India) రూ.2,223 కోట్ల పైమాటే.
రుణం ఎందుకు?
దేశంలోని 13 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య మౌలిక వసతుల పెంచేందుకు ఈ రుణం తీసుకోనుంది భారత్. దీని ద్వారా 25.6 కోట్ల మంది పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు (ADB loan for India Healthcare) అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 51 కోట్ల మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసిస్తున్నవారేనని భారత వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ రుణ ఒప్పందంపై ఏడీబీ, భారత్‌లు సంతకాలు కూడా చేసినట్లు వెల్లడించింది.
ఈ నిధులను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ (ABHWC), ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ యోజన (PMASY) వంటి వాటికి వినియోగించనున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
కరోనా తర్వాత వైద్య సేవలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా వైద్య మౌలిక సదుపాయాలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఏడీబీ నుంచి రుణాలు తీసుకుంటోందని తెలుస్తోంది.
Also read: Gautam Adani: ముకేశ్ అంబానీని దాటేసి.. ఆసియాలో అపర కుబేరుడిగా గౌతమ్ అదానీ
Also read: వరుసగా రెండవరోజు తగ్గిన బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు
ఈ నిధులను వినియోగించే 13 రాష్ట్రాలు ఇవే..
ఏడీబీ తీసుకున్న రుణాలను వినియోగించే 13 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, అసోం, ఝార్ఘండ్, గుజరాత్, హరియాణా, రాజస్థాన్‌లో, పశ్చిమ్ బెంగాల్, మధ్య ప్రదేశ్లు ఉన్నాయి.
Also read: Bank Holidays: డిసెంబర్‌లో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. అవేంటో మీరే చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
ADB loan to India: ఏడీబీ నుంచి భారత్‌కు 300 మిలియన్ డాలర్ల రుణం!
ఏడీబీ నుంచి భారత్‌కు 3 బిలియన్ డాలర్ల రుణం
ఒప్పందంపై భారత్, ఏడీబీ సంతకాలు
వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపునకు నిధుల వినియోగం