Yes Bank, Mack Star case: మాక్ స్టార్ మార్కెటింగ్‌ కేసులో యస్ బ్యాంక్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాక్ స్టార్ మార్కెటింగ్‌ సంస్థ దివాలా తీసినట్టుగా యస్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలను పక్కన పెడుతూ అప్పిలేట్ ట్రిబ్యునల్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది అక్టోబర్ 27న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ మాక్ స్టార్ ట్రేడింగ్ కంపెనీపై ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయగా.. తాజాగా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆ ప్రొసీడింగ్స్‌ని కొట్టిపారేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాక్ స్టార్‌ ట్రేడింగ్ కంపెనీకి యస్ బ్యాంక్ అందించిన టర్మ్-లోన్ ఒప్పందం మోసపూరిత ఉద్దేశంతో పూర్తి లోపభూయిష్టంగా జరిగింది అని ఇద్దరు సభ్యులతో కూడిన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ అభిప్రాయపడింది. అలాంటి లావాదేవీలు ఇన్‌సాల్వెన్సీ అండ్ ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ కోడ్‌లోని సెక్షన్ 5(8) కింద నిర్వచించిన ఆర్థిక రుణం పరిధిలోకి రావని, అందువల్ల సురక్ష అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌ని ఒక ఆర్థిక రుణదాతగా పేర్కొనలేమని ట్రిబ్యునల్ తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. 


మోసపూరితమైన లావాదేవీలు
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ పరిశీలనలోకొచ్చిన అంశాల ప్రకారం మాక్ స్టార్ పేరుతో యస్ బ్యాంక్ ద్వారా మంజూరైన మొత్తంలో 99 శాతానికి పైగా రూ. 147.6 కోట్లు అదే రోజున లేదా స్వల్ప వ్యవధిలోనే బ్యాంకుకు తిరిగి మళ్లించినట్టు తేలింది. 100 కోట్ల రూపాయలతో రెండేళ్ల క్రితం నిర్మించిన 'కలెడోనియా' భవనాన్ని రెనోవేట్ చేసేందుకుగాను యస్ బ్యాంక్ ఈ మొత్తాన్ని మంజూరు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. "యస్ బ్యాంక్ మాక్ స్టార్ ట్రేడింగ్ కంపెనీకి అందించిన రుణాలు, హిస్టరీ వెరిఫికేషన్ ని పరిశీలిస్తే.. టర్మ్ లోన్స్ పూర్తి దురుద్దేశ్యంతో పంపిణీ చేసినట్టు అర్థమవుతోంది అని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ వెల్లడించింది.


ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ రద్దు.. 
మాక్ స్టార్ మార్కెటింగ్‌ కంపెనీపై దివాలా చర్యలను ప్రారంభించడానికి అనుమతిస్తూ గతేడాది అక్టోబర్ 27న  నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు రద్దయ్యాయి. దీంతో తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ని నియమిస్తూ ఎన్‌సిఎల్‌టి జారీ చేసిన ఉత్తర్వులు, మారటోరియం ప్రకటన, ఖాతా స్తంభింపజేయడం, ఇంప్యుగ్డ్ ఆర్డర్‌కు అనుగుణంగా ఆమోదించిన అన్ని ఇతర ఉత్తర్వులను పక్కన పెట్టినట్లు అప్పీలేట్ ట్రిబ్యునల్ స్పష్టంచేసింది. యస్ బ్యాంక్ (YES bank) ఇచ్చిన రుణాలకు అసైనీగా వ్యవహరిస్తున్న సురక్ష అసెట్ రీకన్‌స్ట్రక్షన్ పిటిషన్‌పై గతంలో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది.


Also Read : Car Insurance Policy: బెంగళూరు వరద వంటి పరిస్థితుల్లో కార్ల ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా..ఏ పాలసీ తీసుకోవాలి


Also Read : Gas Agency: గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్ కోసం చూస్తున్నారా..వెంటనే దరఖాస్తు చేయండి మరి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి