Car Insurance Policy: బెంగళూరులో భారీ వర్షాల కారణంగా చాలా కార్లు ధ్వంసమైపోయాయి. వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల్లో కార్లు డ్యామేజ్ అయితే..ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
బెంగళూరులో వరద పెను సమస్యగా మారింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో చాలా నష్టం ఏర్పడింది. వరదలో ఖరీదైన కార్లు ధ్వంసమైపోయాయి. పార్కింగ్, అపార్ట్‌మెంట్ సెల్లార్లలో ఉన్న కార్లు వరద నీటిలో ఈదుతూ కన్పించిన వీడియోలు చూశాం. వరద కారణంగా వాహనాలకు చాలా నష్టం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని..పలు కార్ల కంపెనీలు దెబ్బతిన్న కార్ల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించాయి. ఈ క్రమంలో ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న కార్లకు భీమా సదుపాయం ఎలా ఉందో తెలుసుకోవల్సిన అవసరం ఉంది.
లగ్జరీ కార్ల కంపెనీ లెక్సస్ ఇండియా..వరద ప్రభావిత కస్టమర్ల కోసం వాహనాల మెయింటెనెన్స్ ప్యాకేజ్ ప్రారంభించింది. లెక్సస్ కేర్స్ ప్యాకేజ్‌లో భాగంగా..వరద ప్రభావిత కార్ల మరమ్మత్తు కోసం ప్రత్యేక తోడ్పాటు, కవరేజ్ అందిస్తోంది.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న కార్ల మరమ్మత్తు కోసం కార్ల భీమా కంపెనీలు కొన్ని పాలసీల్ని ప్రవేశపెడుతున్నాయి. వరద ప్రభావితం కారణంగా దెబ్బతిన్న కార్ల మరమ్మత్తుకు కవరేజ్ అనేది..కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ తీసుకుంటేనే వర్తిస్తుందని భీమా కంపెనీలు తెలిపాయి. కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అనేది ఎప్పుడూ ఆప్షన్‌గానే ఉంటుంది. ఇది తీసుకుంటేనే వరద ప్రభావిత పరిస్థితుల్లో కార్లకు కవరేజ్ ఉంటుంది.
కాంప్రెహన్సివ్ కారు భీమా పాలసీ అంటే ఏంటి
కాంప్రహెన్సివ్ కారు భీమా పాలసీలో..కారు యజమానులకు వరదలు, భూకంపం, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎదురైన నష్టాన్ని వసూలు చేసేందుకు ఉంటుంది. ఇది కాకుండా పాలసీలో..మానవ తప్పిదాలైన ఆకస్మిక ప్రమాదాలు, మంటలు చెలరేగటం, విస్ఫోటనం, దొంగతనం వంటివి కూడా కవర్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మరమ్మత్తు ఖర్చు ఎక్కువైనా వర్తిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో మొత్తం నష్టం కూడా కవర్ అవుతుంది. కాంప్రహెన్సివ్ కారు భీమా పాలసీ..అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. కానీ అనుకోని నష్టాలు జరిగినప్పుడు మీకు తోడ్పాటుగా ఉంటుంది.
Also read: Gas Agency: గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్ కోసం చూస్తున్నారా..వెంటనే దరఖాస్తు చేయండి మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook