Yono Shopping Offers: SBI కస్టమర్లకు గుడ్ న్యూస్. షాపింగ్ పై సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది. వేసవిలో షాపింగ్ చేయాలనుకునే వాళ్లకు SBI బ్యాంకుకు చెందిన Yono యాప్ ద్వారా ఈ ఆఫర్లను పొందేందుకు అవకాశం ఉంది. అయితే SBI ప్రవేశపెట్టిన Yono బ్యాంకింగ్ ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఉత్తమ ఫ్యాషన్ బ్రాండ్ లపై భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చాయి. వాటిని కొనుగోలు చేసే క్రమంలో SBI Yono బ్యాంకింగ్ యూజ్ చేయడం వల్ల అనేక గరిష్టంగా 70 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని SBI ట్విట్టర్ ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది. 


Yono యాప్ ద్వారా డిస్కౌంట్ ను పొందడం ఎలా?


1) ముందుగా SBI అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి.. బ్యాంకుకు సంబంధించిన yono యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 


2) లేదంటే ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 


3) ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా SBI బ్యాంకు అకౌంట్ వివరాలతో లాగిన్ అవ్వాలి. 


4) దీని తర్వాత యాప్ లోని ఆఫర్స్ విభాగంలో టైటాన్, లైఫ్ స్టైల్, ట్రెండ్స్, అజియో, ఫిపా వంటి బ్రాండ్స్ పై షాపింగ్ చేసే అవకాశం ఉంది. 


5) అందులో నుంచి మీకు కావాల్సిన బ్రాండ్ మర్చండైజ్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ యాప్ లో చెల్లింపు ద్వారా అత్యధికంగా 70 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. 


SBI Yono యాప్ వినియోగం వల్ల ప్రయోజనాలు..


Yono యాప్ ద్వారా ఆఫర్స్ ఎలా పొందవచ్చో SBI ఓ ట్వీట్ లో వివరించింది. దాని ప్రకారం Yono యాప్ లో బ్రాండ్ మర్చండైజ్ ను భారీ డిస్కౌంట్స్ తో కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా SBI డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేయవడం వల్ల అనేక డిస్కౌంట్స్ తో పాటు రివార్డులను పొందవచ్చు. వీటితో పాటు మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు. 


Also Read: EPF Nomination Benefits: EPFO ఈ-నామినేషన్ పూర్తి చేయకపోతే రూ.7 లక్షల బీమా కోల్పోయినట్టే!


Also Read: Flipkart Realme 8S 5G: రూ.5 వేలకే Realme 8S 5G స్మార్ట్ ఫోన్.. త్వరపడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook