Girl Raped and Killed: 8 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఆ చిన్నారిని రేప్ చేసి, దారుణంగా హత్యకు గురైన ఘటనలో 14 ఏళ్ల మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన ఘటన చత్తీస్ ఘడ్ రాయపూర్ లో జరిగింది. బాలిక కుటుంబం ఉంటోన్న భవనంలో నివాసం ఉంటున్న మరో కుటుంబానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడినే అనుమానితుడిగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 7న చిన్నారి తప్పిపోయినట్టుగా తమకు ఫిర్యాదు అందిందని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న తమకు అదే కాలనీకి వెనుక భాగంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో బాలిక శవం లభించింది అని రాయపూర్ ఎస్ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. నిందితుడు బాలికను అత్యాచారం చేసి చంపేసినట్టు తమ దర్యాప్తులో తేలిందని ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అపహరణ, అత్యాచారం, హత్య ఘటనపై స్థానిక బీజేపి నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణం అని ఆరోపించిన బీజేపి అగ్రనేత సంజయ్ శ్రీవాస్తవ.. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్ల చిన్నారి ఏం తప్పు చేసిందని ఈ దారుణానికి బలి కావాలని సంజయ్ శ్రీవాస్తవ ప్రశ్నించారు. 


చత్తీస్‌ఘడ్ రాష్ట్రం మొత్తం నేరాలకు అడ్డాగా మారిందని.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సురక్షితంగా లేరని సంజయ్ శ్రీవాస్తవ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ మొద్దు నిద్ర వీడటానికి ఒక బాలిక బలి కావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో పోలీసులు అక్రమ, అసాంఘిక వ్యవహారాల్లో పాల్పంచుకుంటున్నారు. దీనికంతటికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం అని అన్నారు. మొత్తానికి బాలిక మృతితో     


దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా ఏర్పాటైన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని నేడు ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌ నేరాలకు అడ్డాగా మార్చారు. రాష్ట్ర హోంమంత్రి ఏమీ పట్టనట్టు నిద్రపోతున్నారు. ఎప్పుడైనా దేనినైనా ఇలా ఎందుకు జరుగుతోంది అని ప్రశ్నించిన దాఖలాలు లేవు" అని సంజయ్ శ్రీవాస్తవ మండిపడ్డారు.


ఇది కూడా చదవండి : Girl Selling Kidney: అమ్మకానికి తెలుగమ్మాయి కిడ్నీ.. ఉల్టా 16 లక్షలు లాస్


ఇది కూడా చదవండి : Acid Attack on Delhi School Girl: రాజధాని ఢిల్లీలో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి!


ఇది కూడా చదవండి : Vaishali Kidnap: అందుకే 36 మందితో కిడ్నాప్ ప్లాన్.. నవీన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook