Vaishali Kidnap: అందుకే 36 మందితో కిడ్నాప్ ప్లాన్.. నవీన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

Vaishali Kidnap Case:  ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో సమర్పించిన నవీన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అనేక కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

Last Updated : Dec 14, 2022, 10:56 AM IST

Cruical information in Vaishali Kidnap Case: హైదరాబాద్ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మనీ గూడలో ఒక డెంటల్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మిస్టర్ టి ఎండి నవీన్ రెడ్డి వ్యవహార శైలి గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో సమర్పించిన ఒక రిమాండ్ రిపోర్టులో అనేక కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న దాని ప్రకారం హైదరాబాద్ మన్నెగూడకు చెందిన విద్యార్థిని వైశాలి బొంగులూరులో బ్యాడ్మింటన్ శిక్షణకు వెళ్లిన సమయంలో మిస్టర్ టిఎండి నవీన్ రెడ్డి పరిచయమయ్యాడని ముందుగా ప్రేమిస్తున్నానని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని వెంటపడడంతో ఇలాంటివన్నీ కుదరవని ఏమైనా ఉంటే తన ఇంటికి వచ్చి మాట్లాడుకోవాలని ఆమె సూచించినట్లు తెలుస్తోంది.

తర్వాత తనకు దగ్గరగా ఉన్న కొందరు పెద్ద మనుషులను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన చేయడంతో వైశాలి తల్లిదండ్రులు దాన్ని తిరస్కరించారని అప్పటినుంచి దాన్ని మనసులో పెట్టుకున్న నవీన్ రెడ్డి ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడం మొదలుపెట్టాడని అంటున్నారు. గతంలో ఆమెతో దిగిన కొన్ని ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడని ఆమె పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచి ఇబ్బందికరమైన ఫోటోలు పెడుతూ ఉండడంతో పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారని తెలుస్తోంది. అయితే కోర్టులో తమ ఇద్దరికీ పెళ్లి కూడా అయిందని కట్టుకథలు వినిపించాడని పోలీసులు గుర్తించారు, ఇక ఈనెల తొమ్మిదవ తేదీన ఆమె నిశ్చితార్థం జరుగుతున్న విషయం తెలుసుకొని ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

తనకు అత్యంత సన్నిహితులు తన టీ ఫ్రాంచైజ్ లలో పనిచేసే 36 మందిని ముందు రోజు రాత్రి మన్నెగూడ రప్పించి ఆమెకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని ఆమె తన ప్రియురాలు అని నమ్మించి కిడ్నాప్ చేయాలనే ప్రణాళికను వారి ముందు ఉంచారు. వారంతా కూడా ఆమె కూడా ఇతన్ని ప్రేమిస్తుందని భావించారు ఈ క్రమంలో నవీన్ సహా ఆ 36 మంది ఉదయం 11 గంటలకు వోల్వో, బొలెరో సహా మరో నాలుగు కార్లు ఇతర వాహనాలలో ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో ఆమె ఇంటికి వెళ్లి అడ్డు వచ్చిన వారిని చితక బాది లోపలికి వెళ్లి ఆమెను అపహరించారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా సాగర్ రోడ్ లో నల్గొండ వైపు బయలుదేరారు, ఆమె ఉన్న కారులోనే నవీన్ రెడ్డి ఆమెను బెదిరించినట్లు తెలుస్తోంది. తాను ఉండగా మరొకరితో పెళ్లికి ఎలా ఒప్పుకుంటావని ఆమెను విపరీతంగా కొట్టినట్లు తెలుస్తోంది.

అయితే టెక్నాలజీ పరంగా ఇబ్బంది పడతామని ఉద్దేశంతో మిర్యాలగూడ వెళ్లే దారిలో అందరి ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టించాడని ఆ తరువాత అందరి ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టినా వార్తలు చూస్తే యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారనే విషయం తెలియడంతో నవీన్ మరో ఇద్దరితో కలిసి మిర్యాలగూడ నుంచి నల్గొండ వెళ్లే మార్గంలో దిగిపోయాడు, అయితే నవీన్ సూచనలతో ఒక కారులో ఆమెను తీసుకువెళ్లి మన్నెగూడ ఆర్డీవో కార్యాలయం వద్ద ఆమెను డ్రాప్ చేశారు, అక్కడ నుంచి తండ్రికి కాల్ చేసి ఆమె సమాచారం ఇవ్వడంతో ఆమెను వెనక్కి తీసుకోవచ్చుకున్నారు తల్లిదండ్రులు.

ఇక ఈ కేసులో నవీన్ రెడ్డిని గోవాలో అరెస్ట్ చేశారు, మంగళవారం సాయంత్రం ఆదిభట్ల సీఐ ఆధ్వర్యంలో ఒక టీం గోవా వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక నవీన్ రెడ్డి పై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు ఉండగా వరంగల్ లో రెండేళ్ల క్రితం ఒక సీటింగ్ చేసిన నమోదయిందని ఈ క్రమంలో అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసే యోచనలో రాచకొండ పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. అతనిని హైదరాబాద్ తీసుకు వచ్చిన తర్వాత మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: CRPC 91: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం, కవితకు షాక్, మళ్లీ సీబీఐ నోటీసులు

Also Read: Nagakanya In Karimnagar: నేనే నాగకన్యను.. నాకు గుడి కట్టండి! పాములాగా యువతి వింత చేష్టలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

 
 

Trending News