Man Murder in Jagtial: ఆ యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో యవతిని మందలించి.. మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. అయితే పెళ్లి అయినా తరువాత కూడా ఆ యువకుడితో ఆమె ఫోన్‌లో మాట్లాడుతోంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మందలించినా.. వారి తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జగిత్యాల జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీర్‌పూర్‌కు చెందిన జువ్వికింది వంశీ (23) అనే యువకుడు.. ఇదే మండలంలోని ఓ యువతి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. తుంగూర్‌లోని డ్రైవింగ్‌ స్కూల్‌లో వంశీ పనిచేస్తుంటాడు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో.. మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. అయితే పెళ్లి అయిన తరువాత కూడా వంశీతో ఆ యువతి ఫోన్‌లో మాట్లాడేది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు హెచ్చరించారు. 


ఆదివారం కొల్వాయి నుంచి బైక్‌పై వంశీ తుంగూర్‌కు వస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. గొడ్డలి, పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో వంశీ ఘటన స్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు యత్నించగా.. వంశీ బంధువులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. 


బలవంతంగా వంశీ మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్తుండగా.. తల్లి భాగ్య, బాబయి లారీకి అడ్డుగా పడుకున్నారు. దీంతో డీఎస్పీ ప్రకాశ్, ఇతర పోలీసు అధికారులు వారితో మాట్లాడారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువులు శాంతించారు. యువతి తండ్రి, సోదరుడిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


Also Read: YSR Law Nestham Scheme: గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్‌లో రూ.25 వేలు జమ  


Also Read: Odisha Bus Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook