Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉనా జిల్లాలోని అంబ్ సబ్ డివిజన్‌లోని రెండు గుడిసెలలో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. చనిపోయినవారు బిహార్‌ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన భదేశ్వర్ దాస్, రమేష్ దాస్‌లకు చెందిన గుడిసెలు బుధవారం రాత్రి అగ్నికి ఆహుతైనట్లు ఎస్‌హెచ్‌ఓ ఆశిష్ పఠానియా తెలిపారు. ఈ ప్రమాదంలో రమేష్ దాస్ ముగ్గురు పిల్లలు, నీతూ (14), గోలు కుమార్ (7), శివమ్ కుమార్ (6), వారి బంధువు కాళిదాస్ కుమారుడు సోను కుమార్ (17) మృతి చెందారు. 


ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మంటలు ఆర్పివేశారు. ఈ మంటలు ఎందుకు చెలరేగాయో తెలియరాలేదు. ఈ ఘటనపై హిమచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేష్‌ అగ్నిహోత్రి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులను కోరారు. 


Also Read: Kakinada Oil Factory: కాకినాడలో తీవ్ర విషాదం.. ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.