Kakinada Oil Factory: కాకినాడలో తీవ్ర విషాదం.. ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి!

7 Peoples Dies in Kakinada While Cleaning Oil Tanker. కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయిల్‌ ట్యాంకర్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతిచెందారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 9, 2023, 11:18 AM IST
  • కాకినాడలో తీవ్ర విషాదం
  • ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి
  • ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ఆరంభం
Kakinada Oil Factory: కాకినాడలో తీవ్ర విషాదం.. ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి!

7 Died in Kakinada While Cleaning Oil Tanker: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయిల్‌ ట్యాంకర్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతిచెందారు. ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన కార్మికులు మృత్యుఒడిలోకి వెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయిల్‌ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్‌ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఈ ఆయిల్‌ ఫ్యాక్టరీలోనే గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి వెళ్లిన 7 మంది కార్మికులు మరణించారు. ఒకరి తర్వాత ఒకరు దిగి ఊపిరాడక చనిపోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయిల్‌ ఫ్యాక్టరీ వద్దకు పరిశీలించారు. 

మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులు ఉండగా.. మిగిలిన ఇద్దరిది పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పాడేరుకు చెందిన మృతులలో కుర్రా రామారావు, వెచ్చంగి కృష్ణ, వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్‌, కురతాడు బంజి బాబు ఉన్నారు. పులిమేరుకు చెందిన మృతుల్లో కట్టమూరి జగదీశ్‌, ప్రసాద్‌ ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. 15  రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేరినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Also Read: టెస్టుల్లో సూర్యకుమార్‌ అరంగేట్రం.. ఎట్టకేలకు ఫలించిన కల! నెరవేసిన భరత్‌ చిరకాల ఆకాంక్ష  

Also Read: Hyderabad Traffic 2023: హైదరాబాద్‌లో మరో 10 రోజులు ట్రాఫిక్‌ జామ్‌లే.. వాహనదారులు నరకం చూడక తప్పదు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News