Maharashtra Cat Rescue Incident: మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బావిలో పడిన పిల్లిని రక్షించే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లోని వాడ్కి గ్రామంలో మంళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. బావిని బయోగ్యాస్‌ కోసం వినియోగిస్తున్నట్లు తెలిసింది. వివరాలు ఇలా.. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు బావిలో పడిపోయిన పిల్లిని కాపాడేందుకు ముందుగా ఒకరు లోపలికి దిగారు. ఇలా ఒకరిని రక్షించేందుకు మరోకరు అంటూ ఆరుగురు బావిలోకి దూకేశారు. చివరి వ్యక్తి నడుముకు తాడు కట్టుకుని దిగడంతో ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Family Star Collections: సగం కూడా కష్టమే.. డిజాస్టర్ వైపు ఫ్యామిలీ స్టార్


ఈ ఘటనపై అహ్మద్‌నగర్‌లోని నెవాసా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ మాట్లాడారు. పిల్లిని రక్షించేక్రమంలో జంతువుల వ్యర్థాలతో బయోగ్యాస్ కోసం వినియోగిస్తున్న బావిలోకి ఆరుగురు దిగారని చెప్పారు. ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. నడుముకు తాడు కట్టుకుని దిగిన వ్యక్తిని రక్షించినట్లు తెలిపారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 


 



ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. మృతులను మాణిక్ కాలే (65), మాణిక్ కుమారుడు సందీప్ (36), అనిల్ కాలే (53), అనిల్ కుమారుడు బబ్లూ (28), బాబాసాహెబ్ గైక్వాడ్ (36)గా గుర్తించామన్నారు. మాణిక్ చిన్న కుమారుడు విజయ్ (35)గా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.


Also Read: Balakrishna: టీడీపికీ ఊపు తెచ్చేందకు నందమూరి బాలకృష్ణ సైకిల్ రావాలి యాత్ర.. ఆ రోజు నుంచి మొదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook