Drugs Seized: దేశంలోకి డ్రగ్స్ ను తరలించేందుకు ప్రయత్నించిన ఓ ఇరాన్ పడవను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) సిబ్బంది పట్టుకున్నారు. ఈ పడవలో రూ.425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్‌తోపాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) ఈ ఆఫరేషన్ నిర్వహించింది. ఈ డ్రగ్స్ తరలిస్తున్న బోటును గుజరాత్ లోని కచ్ జిల్లాలో గల ఓఖా తీరంలో పట్టుకున్నారు. విచారణ కోసం నిందితులను ఓఖాకు తీసుకు వెళ్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిఫెన్స్ వింగ్ ప్రకటన ప్రకారం, గుజరాత్ ఏటీఎస్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా, ఇండియన్ కోస్ట్ గార్డ్ సోమవారం తన రెండు ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ షిప్‌లైన ICGS మీరా బెన్ మరియు ICGS అభీక్‌లను అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ కోసం మోహరించింది. దీంతో ఈ షిప్‌లు ఓఖా తీరానికి దాదాపు 340 కి.మీ (190 మైళ్ళు) దూరంలో ఉన్న భారతీయ జలాల్లో ఒక పడవ అనుమానాస్పదంగా కదులుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ పడను వెంబడించి పట్టుకున్నారు. ఆ పడవను పూర్తిగా తనిఖీ చేయడంతో భారీ మెుత్తంలో డ్రగ్స్ బయటపడింది. 


ఇప్పటివరకు ఏటీఎస్ సమన్వయంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎనిమిది విదేశీ నౌకలను పట్టుకుంది. రూ.2,355 కోట్ల విలువైన 407 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.


Also Read: Unique Baby: రెండు గుండెలు, నాలుగు కాళ్లు, చేతులతో వింత శిశువు జననం.. పుట్టిన 20 నిమిషాలకే.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook