Boy Murder In Sanath Nagar: ప్రపంచం అంతా ఆధునీకత వైపు పరుగులు పెడుతుంటే.. కొందరు మూఢ నమ్మకాల పేరుతో ప్రాణాలను బలి తీస్తున్నారు. ఏదో మారుమూల గ్రామాల్లోనే ఇలాంటి ఘటనలు జరగడం చూశాం గానీ.. ఏకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నరబలి కలకలం రేపుతోంది. అమావాస్య రోజున 8 ఏళ్ల బాలుడిని ఓ హిజ్రా హత్య చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సనత్‌నగర్‌లో చోటు చేసుకున్న సంచలన ఘటన పూర్తి వివరాలు ఇలా..   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని అల్లాదున్‌ కోటిలో వసీంఖాన్ అనే వ్యక్తి వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న ఫిజాఖాన్‌ అనే ఓ హిజ్రా అనే వద్ద ఆయన చిట్టీలు వేశాడు. ఈ చిట్టీలకు సంబంధించిన డబ్బును ఫిజాఖాన్ ఇవ్వకపోవడంతో వసీంఖాన్ వాగ్వాదానికి దిగాడు. గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వసీంఖాన్ కుమారుడు అబ్దుల్ వాహిద్ (8)ను బస్తీలోని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వాహిద్‌ను ప్లాస్టిక్ సంచిలో తీసుకుని ఫిజాఖాన్‌ ఇంటి వైపు వెళ్లారు. 


తన కుమారుడు కనిపించకపోవడంతో వసీంఖాన్ పోలీసులకు రాత్రి ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని హత్య చేసి జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు చెప్పారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులు.. హత్య చేసిన అనంతరం ఎముకలు ఎక్కిడిక్కడ విరిచేశారు. మృతదేహాన్ని ఓ బకెట్‌లో కుక్కి.. ప్లాస్టిక్ సంచిలో తీసుకువెళ్లి నాలాలో పాడేశారు.


Also Read: DA Arrears: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఒకేసారి డబుల్ గిఫ్ట్    


దీంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు అక్కడికి చేరుకుని.. స్థానికుల సాయంతో బాలుడి మృతదేహం కోసం వెతికారు. అక్కడ ఓ ప్లాస్టిక్ సంచిలో ఉన్నట్లు గుర్తించారు. చిట్టీ డబ్బుల వ్యవహారం కారణంగానే బాలుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి.. విచారణ చేస్తున్నారు. మరోవైపు బాలుడిని నరబలి ఇచ్చారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. హిజ్రా ఫిజాఖాన్‌ ఇంటిని ధ్వంసం చేశారు. గురువారం అమావాస్య రోజున క్షుద్ర పూజలు నిర్వహించి హత్య చేసినట్లు అనవాళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. బాలుడి హత్య ఘటనతో అల్లాదున్‌ కోటిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


Also Read: Social Media Followers: ట్విట్టర్‌లో పవన్.. ఫేస్‌బుక్‌లో సీఎం జగన్ టాప్.. ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు అంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook