Man Stripped Clothes On Video Call : అతను ఓ వ్యాపారి. యువతి నుంచి ఫోన్ రాగానే ఆశగా మాటలు కలిపాడు. ఆ తరువాత ఇద్దరు న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. ఇంకేముంది యువతి ఉచ్చులో పడిపోయాడు. ఆ వీడియో క్లిప్‌ను అడ్డం పెట్టుకుని ఏకంగా రూ.2.69 కోట్లు కొల్లగొట్టారు కేటుగాళ్లు. లబోదిబోమంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అహ్మదాబాద్‌లో ఓ వ్యాపారి అక్షయ్ ఎనర్జీ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఆయనకు గతేడాది ఆగస్టు 8న ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు రియా శర్మ అని, మోర్బీలో నివసిస్తున్నట్లు పరిచయం చేసుకుంది. మెల్లగా అతనితో మాటలు కలిపి ముగ్గులోకి దింపింది. వీడియో కాల్‌లో బట్టలు విప్పమని వ్యాపారిని ఒప్పించింది. అనంతరం హఠాత్తుగా కాల్ కట్ చేసింది.  ఆ తరువాత వీడియో క్లిప్‌ను పంపించి రూ.50 వేలు వసూలు చేసింది. డబ్బులు ఇవ్వకపోతే న్యూడ్ వీడియో క్లిప్‌ను వైరల్ చేస్తానని బెదిరించింది. 


ఆ తరువాత బాధిత వ్యాపారవేత్తకు మరో వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. తాను ఢిల్లీ పోలీసు ఇన్స్పెక్టర్ గుడ్డు శర్మ అని చెప్పాడు. న్యూడ్ వీడియో క్లిప్ తన వద్ద ఉందని చెప్పి రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. ఆగస్ట్ 14న ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ ఉద్యోగి అని మరో వ్యక్తి ఫోన్ చేశాడు. న్యూడ్ వీడియో కాల్ కారణంగా మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని రూ.80.97 లక్షలు వసూలు చేశాడు. తరువాత బాధితుడికి నకిలీ సీబీఐ అధికారి నుంచి కాల్ వచ్చింది. మహిళ తల్లి సీబీఐని సంప్రదించిందని.. కేసును పరిష్కరించడానికి రూ. 8.50 లక్షలు రాబట్టుకున్నాడు. అలా గతేడాది డిసెంబర్ 15 వరకు డబ్బు ఇస్తూనే ఉన్నాడు. 


కేసు పరిష్కరించినట్లు బాధితుడికి ఢిల్లీ హైకోర్టు పంపినట్లు నుంచి నకిలీ ఉత్తర్వును అందుకున్నాడు. అయితే ఈ పేపర్లపై బాధితుడికి అనుమానం రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: Pawan Kalyan Speech: నేను అన్నింటికీ తెగించిన వాడిని.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ రియాక్షన్ ఇదే..   


Also Read: Shirdi Bus Accident: షిరిడీ యాత్రకు వెళుతూ తిరిగిరాని లోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి