Crime News: అర్ధరాత్రి ఆటోలో ప్రయాణిస్తుండగా కూర్చునే సీటు విషయంలో వివాదం మొదలైంది. పరస్పరం మాటలతో దాడి చేసుకున్న అనంతరం ఇళ్లకు వెళ్లారు. అయితే ఒకరు మాత్రం తట్టుకోలేక వెంటనే ఇంటికి వెళ్లి మద్యం తాగి తన స్నేహితులతో గొడవపడిన వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఇది బక్రీద్‌ పండుగ రోజే చోటుచేసుకోవడం కలచివేసే విషయం. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Medak Incident: రాత్రికి రాత్రి మెదక్‌లో ఏం జరిగింది? ఉద్రిక్తత పరిస్థితులకు కారణాలు ఏమిటి


నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన ఫరూక్, కిష్టాపురం గ్రామానికి చెందిన ముర్తుజా వ్యాపారం చేస్తుంటారు. టాటా ఏస్‌ ఆటోలో సుదూర ప్రాంతాలకు వెళ్లి కవ్వ బన్ను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే రోజులాగానే సోమవారం కూడా వ్యాపారానికి వెళ్లి తిరుగుముఖం పట్టారు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆటో క్యాబిన్‌లో కూర్చొన్నే విషయంలో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. మాటామాట పెరిగి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరింది.

Also Read: Hajj Pilgrims: హజ్‌ యాత్రలో మృత్యుఘోష.. ఎండ వేడికి తాళలేక పిట్టల్లా రాలుతున్న భక్తులు


ఇంటికి వెళ్లి మరీ
అనంతరం వారిద్దరూ తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే కొద్దిసేపటికి ఫరూక్ మద్యం సేవించి ముర్తూజకు ఫోన్ చేసి బూతులు తిట్టాడు. తనను దూషించడాన్ని తట్టుకోలేని ఫరూక్‌ వెంటనే ఆత్మకూరులోని తన స్నేహితుడు ఖాజావలితోపాటు మరో నలుగురిని వెంటబెట్టుకుని కురుకుంద గ్రామానికి చేరుకున్నాడు. తనను తిట్టిన ఫరూక్‌తో ఘర్షణకు దిగారు. క్షణికావేశంలో చూసుకోకుండా తాను వెంటబెట్టుకొచ్చిన తన స్నేహితుడు ఖాజావలిపైనే కత్తితో దాడి చేశాడు.


పొరపాటున
తీవ్ర గాయాలతో ఖాజావలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో విస్తుపోయిన ఫరూక్‌ ఏం చేయాలో పాలుపోలేదు. గొడవ కోసం సహాయంగా తీసుకొచ్చిన తన మిత్రుడినే హత్య చేయడంతో తట్టుకోలేక పారిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆ గ్రామానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఫరూక్‌ కోసం గాలిస్తున్నారు. అయితే బక్రీద్‌ పండుగ రోజే ఈ సంఘటన చోటుచేసుకోవడం ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter