Medak Incident: రాత్రికి రాత్రి మెదక్‌లో ఏం జరిగింది? ఉద్రిక్తత పరిస్థితులకు కారణాలు ఏమిటి

What Happened Over The Night Medak Incident: మత ఘర్షణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. మెదక్‌లో రాత్రికి రాత్రే ఓ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అయితే అసలు ఏం జరిగిందో పాయింట్లవారీగా తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 16, 2024, 10:57 PM IST
Medak Incident: రాత్రికి రాత్రి మెదక్‌లో ఏం జరిగింది? ఉద్రిక్తత పరిస్థితులకు కారణాలు ఏమిటి

Medak Incident: తెలంగాణలో పదేళ్లుగా మరచిపోయామనుకున్న మత ఘర్షణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. మెదక్‌ పట్టణంలో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ ఘర్షణలు రాజకీయ వివాదానికి దారి తీశాయి. కాగా శాంతిభద్రతలు క్షీణించడంతో వెంటనే పట్టణంలో కఠిన ఆంక్షలు అమలు చేశారు. అయితే అసలు మెదక్‌లో ఏం జరిగింది? ఎందుకు ఉన్నఫలంగా ఘర్షణలు తలెత్తాయనేది చర్చ జరుగుతోంది.

Also Read: Chandrababu: ముఖ్యమంత్రి అయ్యి 24 గంటలు కాలేదు.. అప్పుడే చంద్రబాబుపై ప్రశంసల వర్షం

తెలంగాణ మొత్తం ప్రశాంతంగా నిద్రలేవగా ఒక్క మెదక్‌ మాత్రం అల్లర్లు, ఘర్షణలతో నిద్రలేచింది. శనివారం రాత్రిపూట మెదక్‌లో జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా.. మానవత్వం ప్రదర్శించిన ఓ ఆస్పత్రిపై కూడా దాడులు జరిగాయి. తెల్లవారుజాము వరకు మెదక్‌ మొత్తం అల్లర్లు చెలరేగడంతో భయానక వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా.. ఓ పార్టీ మెదక్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. సున్నితమైన అంశం కావడంతో రాజకీయ పార్టీలు ఆచితూచి స్పందించాయి. అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్‌ కుమార్‌ స్పందించారు. ఇక సొంత నియోజకవర్గంలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులతో మాట్లాడి.. అనంతరం బాధితులతో కూడా మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. కాగా అసలు వివాదం ఎక్కడ మొదలైంది.. ఏం జరిగిందనేది పాయింట్ల వారిగా తెలుసుకుందాం.

Also Read: Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..

పాయింట్ల వారిగా
- మెదక్‌లో శనివారం సాయంత్రం గోవులను ఓ వర్గం వార తరలిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో వెంటనే బీజేపీతోపాటు హిందూత్వ సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేశారు.
- దీనికి ప్రతిగా మరో వర్గం పోటీగా ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ రెండు వర్గాల మధ్య వివాదం మొదలైందని స్థానికులు చెబుతున్నారు.
- ఈ క్రమంలో ఓ వ్యక్తిపై కత్తి పోట్లు చోటుచేసుకున్నాయి. మరికొందరికి గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా మెదక్‌ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
- ఇరు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్న మాట.
- అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బందోబస్తు చేపట్టారు.
- ఈ ఘర్షణల్లో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి మానవత్వంతో వైద్యం అందించారు. ప్రత్యర్థి వర్గం ఆస్పత్రిపై కూడా దాడికి పాల్పడింది. వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులపై కూడా దాడికి పాల్పడ్డారని సమాచారం. ఈ సంఘటనపై ఆస్పత్రి యాజమాన్యం ఖండిస్తూ వైద్యం చేయడం కూడా తప్ప? అని ప్రశ్నించింది.
- ఆదివారం ఉదయం వరకు మెదక్‌ పట్టణం మొత్తం ఈ వివాదం వ్యాపించింది.
- ఓ వర్గం మెదక్‌ పట్టణం బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టణం మొత్తం నిరనలు, ఆందోళనలు చేపట్టింది.
- సోషల్‌ మీడియాలో ఈ వివాదం మరింత ప్రచారం లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వివాదం తెలిసింది.
- బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ ఘటన జరగడంపై స్పందించారు. తమ పదేళ్ల పాలనలో ఎలాంటి వివాదం లేదని.. ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుని శాంతిభద్రతలు పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు.
- అయితే ఈ వివాదంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ మెదక్‌ వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అతడిని హైదరాబాద్‌కే పరిమితం చేశారు.
- ఈ సంఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరా తీశారు. స్థానిక పోలీసులతో నివేదిక తెప్పించుకుని పర్యవేక్షించారు.
- ఇక మెదక్‌ ఎంపీగా ఎన్నికైన బీజేపీ నాయకుడు రఘునందన్‌ రావు రాత్రి మెదక్‌కు చేరుకున్నారు. స్థానిక పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
- ఈ ఘర్షణల నేపథ్యంలో మెదక్‌లో కొన్ని రోజులు కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని అక్కడి పోలీస్‌ అధికారులు ప్రకటించారు.
- కాగా ఈ వివాదంపై హోం శాఖ, పోలీస్‌ ఉన్నత అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. తదుపరి ఎలాంటి వివాదం రాజుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
- ఈ వివాదానికి మొత్తం కారణం ఓ వర్గానికి చెందిన పండుగ అని.. ఆ పండుగ కోసం జంతువులను తరలిస్తున్నారనే ప్రచారం జరగడంతో ఈ వివాదం చెలరేగింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

 

 

Trending News