Bansuwada Woman Killed in Uttar Pradesh: ఆమెకు అప్పటికే పెళ్లి అయింది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతడి కోసం కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను వదిలి వెళ్లిపోయింది. అతని వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుందామని కోరింది. ఆ యువకుడు పెళ్లికి ఒప్పుకోక పోగా.. ఆమెను హత్య చేశాడు. ఆమె ఉత్తరప్రదేశ్‌లో హత్యకు గురవ్వగా.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాన్సువాడకు చెందిన ముఖీద్‌, ఉస్మా బేగం భార్యాభర్తలు. ఈ నెల 6వ తేదీన ఉస్మా బేగం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లింది. దీంతో తన భార్య అదృశ్యమైందంటూ ముఖీద్ బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. ఉత్తర ప్రదేశ్‌లో ఆమె హత్యకు గురైనట్లు సమాచారం అందింది. 


బాన్సువాడ నుంచి అక్కడి ఎందుకు వెళ్లిందని ఆరా తీయగా.. అక్కడి పోలీసులు పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలను తెలిపారు. యూపీలోని అమ్రోహా జిల్లాలో షెహజాద్‌తో ఉస్మా బేగం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అతడి కోసం ఆమె ఇల్లు వదిలి యూపీకి వెళ్లింది. షెహజాద్‌ను కలుసుకుని పెళ్లి చేసుకుందామని అడిగింది. అతను ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో కోపోద్రిక్తుడైన షెహజాద్‌.. ఆమెను ఇటుకతో తలపై చితకబాది హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తాను పనిచేస్తున్న చెక్‌మేట్‌ సెక్యూరిటీ కంపెనీ ఆవరణలో పడేశాడు. 


గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు.. కంపెనీ ఉద్యోగులను విచారించారు. కంపెనీకి సంబంధించిన తాళం షెహజాద్ వద్ద ఉంటుందని తోటి ఉద్యోగులు చెప్పగా.. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తమ ఫేస్‌బుక్ ప్రేమ కథ, హత్య గురించి విషయాలను బయటపెట్టాడు.  


ముఖీద్‌, ఉస్మా బేగంలకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా.. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె గత రెండు నెలలుగా నిజామాబాద్‌లో ఉంటుంది. ఇటీవల పెద్దలు రాజీ కుదర్చడంతో ఈ నెల 4వ తేదీన పిల్లలను తీసుకుని భర్త వద్దకు వచ్చింది. అయితే రెండు రోజుల్లోనే ఇంటి నుంచి వెళ్లిపోయి.. యూపీలో హత్యకు గురైంది. 


Also Read: PAK Vs ENG: బిగ్‌ ఫైట్‌కు పాకిస్థాన్, ఇంగ్లండ్ రెడీ.. డ్రీమ్ 11 టీమ్‌పై ఓ లుక్కేయండి  


Also Read: Cord For Weight Loss: సీజనల్‌ వ్యాధులకు, అధిక బరువుకు ఇలా చలి కాలంలో 12 రోజులో చెక్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter,  Facebook