PAK Vs ENG Dream 11 Prediction: గత నెల రోజులుగా క్రికెట్ అభిమానులను అలరించిన పొట్టి ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. హాట్ ఫేవరెట్స్ అన్ని గ్రూప్, సెమీస్‌లో దశలోనే ఇంటి ముఖం పట్టగా.. అంచనాలు తలకిందులు చేస్తూ పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం రెండు జట్ల మధ్య రెండు జట్ల మధ్య తుది పోరు జరగనుంది. మెల్‌బోర్న్ వేదికగా నేడు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి పాక్.. భారత్‌ను చిత్తు చేసి ఇంగ్లండ్ జోష్ మీద ఉన్నాయి. ముఖాముఖి పోరులో ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య 18-9గా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 28 టీ20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అందులో 18 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. ఒక్క మ్యాచ్‌లో ఫలితం రాలేదు. T20 ప్రపంచకప్‌లో ఈ జట్లు రెండుసార్లు ముఖాముఖి తలపడగా.. రెండుసార్లు కూడా ఇంగ్లండ్ విజయం సాధించింది. 2019 నుంచి జరిగిన 14 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఎనిమిందిటిలో.. పాక్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇటీవల జట్ల మధ్య 7 మ్యాచ్‌ల సిరీస్ కూడా జరిగింది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 4-3తో గెలిచింది.
ఈ నేపథ్యంలోనే రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగనుంది. పాకిస్థాన్ 2009లో ఛాంపియన్‌గా నిలవగా.. ఇంగ్లండ్ 2010లో పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. నేడు ఏ జట్టు గెలిచినా.. రెండోసారి ప్రపంచ కప్‌ను చేజిచ్చుకుంటాయి.
అయితే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం సూచన ఉండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవేళ నేడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. సోమవారం రిజర్వ్ డే రోజు నిర్వహిస్తారు. రెండోరోజు కూడా వర్షం కురిస్తే.. రెండు జట్లను జగజ్జేతలుగా ప్రకటిస్తారు. ఇప్పటికే మెల్‌బోర్న్‌కు అభిమానులు భారీగా టికెట్లు బుక్ చేసుకోవడంతో.. వర్షం రాకూడదని ప్రార్థనలు చేస్తున్నారు.
తుది జట్లు (అంచనా):
పాకిస్థాన్: బాబర్ ఆజమ్ (C), మహ్మద్ రిజ్వాన్ (WK), మహ్మద్ హారీస్, ఇఫ్తికర్ అహ్మద్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వాసిం, మహ్మద్ నవాజ్, హారీస్ రవూఫ్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (C&WK), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్/ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
డ్రీమ్ 11 టీమ్:
వికెట్ కీపర్: జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్
బ్యాట్స్‌మెన్: బాబర్ ఆజమ్, ఇఫ్తికార్ అహ్మద్, అలెక్స్ హేల్స్
ఆల్ రౌండర్లు: బెన్ స్టోక్స్, శామ్ కర్రన్, షాదాబ్ ఖాన్
బౌలర్లు: మార్క్ వుడ్, హరీస్ రవూఫ్, షాహీన్ ఆఫ్రిది
కెప్టెన్: జోస్ బట్లర్
వైస్ కెప్టెన్: షాదాబ్ ఖాన్
Also Read: T20 World Cup Finals 2022: టీ20 ప్రపంచకప్ తుదిపోరు నేడే, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు
Also Read: Delhi Earthquake: ఢిల్లీలో భూకంపం.. 5 సెకన్లపాటు కంపించిన భూమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook