Bihar Rape Case: కన్నకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధ తండ్రి. తనకు పుత్ర సంతానం కావాలనే కొరికతో ఓ తండ్రి.. కూతుళ్లపై దారుణానికి ఒడిగట్టాడు. తాంత్రికుడు చెప్పిన మాటలను విన్న ఆ వ్యక్తి.. తన కూతుళ్లపై గత కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తూ లైంగిక వేధించాడు. అలాంటి నీచమైన వ్యక్తి వల్ల సభ్య సమాజం తల దించుకునే పరిస్థితి నెలకొంది. ఆ వ్యక్తికి ఇప్పుడు కోర్టు శిక్షని విధించింది. జీవిత ఖైదును విధిస్తూ న్యాయస్థానం తీర్పు నిచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిదంటే?
పాట్నాలోని బక్సర్ కు చెందిన ఓ తల్లీదండ్రులు ఎప్పటి నుంచో తమకు పుత్ర సంతానం కావాలని ఎదురుచూస్తుంది. అయితే వారికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కావాలని కారణంగా అజయ్ కుమార్ అనే తాంత్రికుడు వద్దకు ఆ తండ్రి వెళ్లాడు. బంధువు వల్ల తాంత్రికుడు వద్దకు చేరుకున్న ఆ తండ్రి తన గోడును వెళ్లబోసుకున్నాడు. 


తనకు పుత్ర సంతానం కావాలంటే ఏం చేయాలని అతడ్ని అడిగాడు. వివరాలన్నీ విన్న తాంత్రికుడు అజయ్.. తన కూతుళ్ల వల్లే అతని పుత్ర సంతానం కలగడం లేదని చెప్పాడు. కొడుకు పుట్టాలంటే కూతుళ్లతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని అజయ్ ఆ తండ్రికి వెల్లడించాడు. అప్పటి నుంచి తన కూతుళ్లపై అతి కిరాతకంగా, బలవంతంగా వారిపై అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. ఆ చెత్త పనికి అతని భార్యతో పాటు ఆమె సోదరి కూడా సహకరించారు. 


Also Read: MLC Kavitha: ఈడీ నోటీసులను లైట్‌ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత.. విచారణకు డుమ్మా..?   


అలా సాగుతున్న క్రమంలో తండ్రితో పాటు ఆ తాంత్రికుడు కూడా వారిపై తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. 2012 నుంచి ఈ తంతు సాగుతుందని విచారణలో తేలింది. తండ్రి చేసే లైంగిక వేధింపులకు భరించలేక ఆ ఇద్దరు ఆడపిల్లలు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసు కేసు పెట్టే సమయానికి ఆ బాధితుల వయసు 16, 14 ఏళ్లుగా ఉంది. పోలీసులు కేసు మేరకు విచారణ చేపట్టిన కోర్టు.. తండ్రిని దోషిగా నిర్ధారించింది. ఈ వికృత చర్యకు కారణమైన తాంత్రికుడితో పాటు తండ్రికి జీవిత ఖైదును న్యాయస్థానం విధించింది. 


అత్యాచారానికి సహకరించిన ఆడపిల్లల తల్లితో పాటు ఆమె సోదరికి 20 ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 4తో పాటు IPC సెక్షన్ 376, 34 కోర్టు వీరిని దోషులుగా ప్రకటించింది. అయితే ఇందులో మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే వారికి ఓ కొడుకు పుట్టాడు.


Also Read: Birth Certificate: ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్ చాలు గురూ.. అన్నింటికి సింగిల్ డాక్యుమెంట్‌గా..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook