Body chopped: ఢిల్లీలో 3 ముక్కలుగా నరికిన మృతదేహం లభ్యం.. టెర్రరిస్టు లింకుల కలకలం!
Body chopped into 3 pieces found: గతేడాది దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో శ్రద్ధా వాకర్‌ను చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చి ఎక్కువ కాలం కూడా గడవక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
Body chopped into 3 pieces found at Bhalswa drain Delhi: గతేడాది దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో శ్రద్ధా వాకర్‌ను చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత దాదాపుగా అలాంటి కేసులు అనేకం తెర మీదకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ కేసు విచారణ ఇంకా పూర్తికాక ముందే ఢిల్లీలో ఇలాంటిదే మరో కేసు తెరపైకి వచ్చింది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం భల్స్వా డ్రెయిన్ (ఉత్తర ఢిల్లీ) నుంచి మూడు ముక్కలుగా నరికిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న వ్యవహారం కలకలం రేపింది.
ఇక ఊహించని విధంగా అక్కడ మృతదేహం వెలికి తీయడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఢిల్లీ పోలీసులు మూడు ముక్కలుగా నరికిన మృతదేహాన్ని వెలికితీసి అది ఎవరిదా అని గుర్తించే పనిలో పడ్డారు. ఇక ఈ కేసులో ఇద్దరు నిందితులు నౌషాద్, జగ్జీత్ సింగ్‌లను అరెస్టు చేశారు. యూఏపీఏ కింద ఇద్దరినీ అరెస్టు చేశారని అంటున్నారు. ఇక ఢిల్లీలోని జహంగీర్‌పురి నుంచి అరెస్టయిన ఈ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను విచారించిన తర్వాత హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం కూడా చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు భల్స్వా డెయిరీలోని ఈ అనుమానితుల ఫ్లాట్‌పై దాడి చేసి వారి నుండి రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఈ దాడి సమయంలో ఫ్లాట్ గోడపై రక్త నమూనాలు కనిపించడంతో, పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం నుండి నమూనాలను పరీక్ష కోసం పంపి దీని గురించి ఇద్దరినీ ప్రశ్నించగా, నిందితులు ఈ ఫ్లాట్‌లో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ నిందితులు ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేసి ఆ వీడియో తీసి తమ హ్యాండ్లర్‌కు పంపించారని అంటున్నారు. ఇక ఇప్పుడు హత్యకు గురైన యువకుడి సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దర్యాప్తు చేస్తోందని అంటున్నారు.
ప్రాధమికంగా అందుతున్న సమాచారం మేరకు నిందితుడు జగ్జీత్ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ బంబిహా గ్యాంగ్‌తో సంబంధం కలిగి ఉన్నాడని ఈ క్రమంలో అందువల్ల హత్యకు గురైన వ్యక్తి బాంబిహా గ్యాంగ్‌కి ప్రత్యర్థి వర్గానికి చెందినవాడని భావిస్తున్నా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. గణతంత్ర దినోత్సవం సన్నాహాలు చివరి దశలో ఉన్న తరుణంలో ఢిల్లీలో జరిగిన ఈ సంచలన ఘటన తెరపైకి రావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఉగ్రవాదులు ఒక లక్ష్యం తోనే హత్యకు ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక నిందితుల నుంచి మూడు పిస్టల్స్, 22 లైవ్ కాట్రిడ్జ్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోగా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్పెషల్ సెల్ కూడా రెండు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుంది.
నిందితులను శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచామని, వారిని 14 రోజుల పోలీసు కస్టడీకి పంపామని ఢిల్లీ పోలీసు అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. ఇక నిందితులిద్దరూ ఖలిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఈ అనుమానితులు కెనడాలో తలదాచుకున్న ఖలిస్తానీ ఉగ్రవాది జగ్గాతో పరిచయం కలిగి ఉన్నాని అంటున్నారు. .నౌషాద్‌కు 'హర్కత్ ఉల్-అన్సార్' అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందని విదేశాల్లో నివసిస్తున్న దేశ వ్యతిరేక శక్తుల నుంచి సూచనలను అందుకుంటున్న జగ్జీత్ పేరుమోసిన 'బంబిహా' ముఠా సభ్యుడుని కూడా గుర్తించారు.
Also Read: Chiranjeevi Comments: డైరెక్టర్ల మొదటి సక్సెస్ అదే అవ్వాలి.. అంతేకానీ అర్రులు చాచకండి.. చిరు కామెంట్స్ వైరల్!
Also Read: Balakrishna Opens up: వీర సింహా రెడ్డిలో అందుకే ఆ డైలాగులు.. అసలు విషయం బయటపెట్టిన బాలకృష్ణ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook