Balakrishna Responds on Dialouges against AP Govt: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. ఇక సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా వీర సింహారెడ్డి సినిమా నిలిచింది. అయితే సంక్రాంతి సంబరాలు బావ చంద్రబాబు ఇంట నారావారిపల్లెలో జరుపుకునేందుకు నాలవారిపల్లె వెళ్లిన నందమూరి బాలకృష్ణ చంద్రగిరి ఎస్వీ థియేటర్లో సందడి చేశారు.
నారావారిపల్లె నుంచి స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన నందమూరి బాలకృష్ణ సినిమా వీక్షించి ప్రేక్షకులందరిలో జోష్ నింపారు. నందమూరి మోక్షజ్ఞ, నారా దేవాన్స్, వసుంధర వంటి వారితో సినిమాకు వచ్చిన బాలయ్యకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలకగా థియేటర్ వద్ద కోలాహలం నెలకొంది. జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేస్తూ బాలకృష్ణ కుటుంబాన్ని పూల వర్షంతో ముంచెత్తారు. ఈ సందర్భంగా అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి వీర సింహారెడ్డి సినిమా వీక్షించిన బాలయ్య అనంతరం 50 కేజీల భారీ కేక్ కట్ చేశారు. ఇక అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా ఒక ఫ్యాక్షన్ సినిమా కాదని ఒక కుటుంబ కథా చిత్రం అని బాలకృష్ణ పేర్కొన్నారు. అందుకే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు.
సంక్రాంతి పండుగ అంటే బాలకృష్ణ పండుగలా ప్రేక్షకులు మార్చేశారని నిర్మాతలు ఈ సినిమా నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారని అన్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని నా అభిమాని కావడంతో అభిమానిగా గొప్ప సినిమా తీశారని ఆణిముత్యం లాంటి పాటలకు వజ్రాల లాంటి బాణీలు కూడా థమన్ సమకూర్చారని అన్నారు. ప్రేక్షకులు మంచి సినిమా చేస్తే ఆదరిస్తారని మరోసారి నిరూపించారని బాలకృష్ణ అన్నారు. ఇక సినిమాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంభాషణలు ఉన్నాయని అంశం మీద స్పందించిన బాలకృష్ణ ప్రజల అభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరని, ప్రజలకు వాస్తవాలు తెలుసని అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్న బాలకృష్ణ ఒక నటుడిగా, ఎమ్మెల్యేగా, ఒక ఓటరుగా చెబుతున్నా ఏపీలో జరుగుతున్న పరిస్థితులనే వీర సింహారెడ్డి సినిమాలో చూపించామని, ఎక్కడా ఎక్కువ చేసి చూపించలేదని బాలకృష్ణ పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వం ఈ అంశం మీద సీరియస్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంభాషణలు ఉన్నాయన్న విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు ఈ విషయం తెలుసుకోవాలని కొందరు అధికారులను ఆదేశించగా వారు గురువారం అర్ధరాత్రి విజయవాడలో స్పెషల్ షో వేయించుకుని మరీ సినిమా చూశారు. సినిమాలో కొన్ని సంభాషణలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నాయని విషయం అర్థం చేసుకుని ఇదే విషయాన్ని తమ నివేదికలో ప్రభుత్వ పెద్దలకు సమర్పించారు. అయితే ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? ఎలా కట్టడి చేయాలి అనే విషయం మీద వైసీపీ ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతుందని వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.
Also Read: Chiranjeevi Comments: డైరెక్టర్ల మొదటి సక్సెస్ అదే అవ్వాలి.. అంతేకానీ అర్రులు చాచకండి.. చిరు కామెంట్స్ వైరల్!
Also Read: Chiranjeevi -Raviteja: మరో మల్టీస్టారర్ కు సిద్దమైన చిరు-రవితేజ.. మైత్రీ మేకర్స్ కూడా రెడీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook