Brother, Sister Got Married: అన్నాచెల్లెళ్ల బంధాన్ని మాటల్లో వర్ణించలేం. ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా సరే.. అన్నాచెల్లెల్ల బంధం అంటే మాటలకు అందని అత్యంత పవిత్రమైన బంధం. అలాంటి అన్నా చెల్లెళ్ల బంధానికి మాయని మచ్చ తెచ్చారు ఈ ఇద్దరు. ఈ ఏడాది రక్షా బంధన్ పండగ మొన్నే పూర్తి కాగా.. అంతకంటే ముందే చెల్లెలిని పెళ్లి చేసుకుని అక్కడి నుంచి ఆమెని తీసుకుని ఉడాయించాడు ఓ మూర్ఖుడు. ఈ షాకింగ్ న్యూస్ తెలిసి సభ్య సమాజం తలదించుకుంటోంది. జీ న్యూస్ హిందీలో ప్రచురించిన ఓ కథనంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనియాంశమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ పట్టణంలో ఓ యువకుడు తన కజిన్‌ సిస్టర్‌ని పెళ్లి చేసుకోవడం చర్చనియాంశమైంది. ఈ ఘటనలో బాలిక మైనర్ అని తెలుస్తోంది. ధన్‌బాద్‌లోని తోపచంటి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ శనివారం ఖేష్మీ దుర్గ గుడిలో పెళ్లి చేసుకుని అనంతరం అక్కడి నుండి విజయవాడ పారిపోయారు. 


దీపక్ అయోధ్య నివాసి
చెల్లి అయిన మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్న నిందితుడి పేరు దీపక్ భారతి. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య నివాసి కాగా.. అతడు పెళ్లి చేసుకున్న మైనర్ బాలిక ధన్బాద్‌లోని తోపచంటి ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈ ఇద్దరి మధ్య చాలా కాలంగా ఎఫైర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ మైనర్ బాలిక ఇంట్లోంచి అదృశ్యమైంది. 


బాలిక కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు. బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసే క్రమంలోనే వారికి మరో వార్త తెలిసింది. అమ్మాయికి అన్నయ్య వరుస అయిన దీపక్ కూడా కనిపించకుండా పోయినట్టు తెలిసి షాక్ అయ్యారు. ఫోన్ చేస్తే.. ఇద్దరి ఫోన్స్ కూడా స్విఛాప్ వస్తున్నాయి. ఇక్కడే ఇరు కుటుంబాలకు అనుమానం వచ్చింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తమ బంధువు కూడా మిస్సింగ్ అయినట్టు చెప్పడంతో వాళ్లు ఇచ్చిన లీడ్స్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


ఇది కూడా చదవండి : Attack on Dalit Man: ఇద్దరు యువకులను తలకిందులుగా వేళ్లాడదీసి, కింద పొగ పెట్టి మరీ దాడి


ఇదిలావుంటే, ఇదే ఘటనకు సంబంధించి మరో సమాచారం కూడా అందుతోంది. అన్న, చెల్లెలు పారిపోయి విజయవాడ చేరుకోవడానికి ముందు జార్ఖండ్‌లోని గోమోకు పారిపోయినట్టు తెలుస్తోంది. ఇంట్లోంచి పారిపోయి గోమోకు వెళ్లిన తరువాత, ఆ ఇద్దరూ తాము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం అని తమ రెండు కుటుంబాలకు ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి ఒప్పకోలేదని.. ఆ తరువాతే ఖేష్మీ దుర్గ గుడిలో పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు సైతం నిరాకరించడం గమనార్హం.


ఇది కూడా చదవండి : Deepthi Murder Case: దీప్తి హత్య కేసులో సంచలన విషయాలు.. దారుణంగా చంపేసిన చందన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి