Deepthi Murder Case: దీప్తి హత్య కేసులో సంచలన విషయాలు.. దారుణంగా చంపేసిన చందన

Deepthi Murder Case Details: కోరుట్ల దీప్తిని చెల్లెలు చందన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. నోటికి, ముక్కుకు ప్లాస్టర్, స్కార్ఫ్‌ బిగించి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 2, 2023, 07:07 PM IST
Deepthi Murder Case: దీప్తి హత్య కేసులో సంచలన విషయాలు.. దారుణంగా చంపేసిన చందన

Deepthi Murder Case Details: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోరుట్ల దీప్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీప్తిది హత్యేనని తేల్చిన పోలీసులు.. చెల్లి చందన దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు. చందనతోపాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసిన విచారణ చేపట్టగా.. అసలు నిజాలు వెలుగు చూశాయి. ప్రత్యేక బృందాలు గాలించగా.. చందన, ప్రియుడు ఉమర్ షేక్‌ ఒంగోలులో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. దీంతో దీప్తి హత్య కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..

బంక శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం ఉన్నారు. పెద్ద కూతురైన బంక దీప్తి గత కొద్ది రోజుల నుంచి సాఫ్ట్ వేర్  జాబ్ తన ఇంటిలో నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తోంది. చిన్న కూతురు బంక చందన 2019 సంవత్సరంలో మల్లారెడ్డి కాలేజీలో బీటెక్‌లో  జాయిన్ అయింది. తన క్లాస్‌మెట్ ఉమర్ షేక్ సుల్తాన్ (25)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. బీటెక్ పూర్తి చేసిన చందన.. గత కొద్ది రోజుల నుంచి కోరుట్లలోనే తన ఇంటి వద్ద ఉంటోంది. తన బాయ్ ఫ్రెండ్‌కు చందన ఫోన్ చేస్తూ.. అప్పుడప్పుడు కోరుట్లకు వచ్చి చందనను కలుస్తుండేవాడు. 

ఆగస్టు 19న కోరుట్లకు ఉమర్ వచ్చాడు. తన ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరని.. బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందామని చందన తెలిపింది. జాబ్, డబ్బులు లేకుండా బయటకు వెళ్లి ఎలా జీవిస్తామని చందనను ఉమర్ అడగ్గా.. మనం ఏదైనా సరే పెళ్లి చేసుకోవాలని చందన చెప్పింది. ఈ విషయంపై ఉమర్ తల్లి సయ్యద్ ఆలియా మహబూబ్, చెల్లె ఫాతిమా, ఫ్రెండ్ హఫీజ్‌తో  కలిసి చందనతో మాట్లాడారు. తర్వాత రెండు రోజులకు చందన ఉమర్‌కు ఫోన్ చేసి.. మా ఇంట్లో బంగారం డబ్బులు బాగా ఉన్నాయని వాటిని తీసుకెళ్లి మనం పెళ్లి చేసుకొని బతుకుదామని చెప్పింది. అప్పుడు ఉమర్ తన కుటుంబ సభ్యులకు చందన వద్ద పెద్ద మొత్తంలో బంగారం, డబ్బులు ఉన్నాయని చెప్పాడు.

పథకంలో భాగంగా చందన ఉమర్‌కి కాల్ చేసి.. ఆగస్టు 28న తమ తల్లిదండ్రులు హైదరాబాదులోని ఒక ఫంక్షన్‌కి వెళ్తున్నారని.. అక్క దీప్తి, తాను మాత్రమే ఉంటామని ఉమర్‌కు చెప్పి.. కోరుట్లకు రమ్మని చెప్పింది. 28న ఉదయం 7 గంటల సమయంలో ఉమర్ తన కారులో హైదరాబాదు నుంచి బయలుదేరి 11 గంటలకు కోరుట్లకు చేరుకున్నాడు. ప్లాన్ ప్రకారం చందన వోడ్కా అక్కకు తాగిపించి తను పడుకున్న తర్వాత రాత్రి 2 గంటల సమయంలో ఉమర్‌కు తన ఇంటికి రమ్మని మెసేజ్ చేసింది. ఉమర్ చందన ఇంటి వెనకాల కారును పార్కు చేసి ఇంటి వెనకాల గేటు నుంచి ఇంటిలోకి ప్రవేశించాడు. 

ఇంటి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు సర్దుతుండగా.. అలికిడికి అక్క దీప్తి లేచి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావే అని అరుపులు చందనపై అరిచింది. దీంతో టేప్‌లతో  చందన, ఉమర్‌లు ఇద్దరు కలిసి దీప్తి ముక్కు, మూతికి  స్కార్ప్‌ చుట్టి, చున్నీతో చేతులు కట్టేశారు. మూతి, ముక్కుపై టేపును అంటించి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కట్లన్నీ విప్పేసి మందు తాగి చనిపోయిందని నమ్మించే విధంగా సీన్ క్రియేట్ చేశారు. అనంతరం డబ్బు, నగలుతో ఇంటి నుంచి పారిపోయినారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఐదుగురు నిందితులు కలిసి మహారాష్ట్ర వైపు పారిపోతున్నారని సమాచారం రాగా.. ఆర్మూర్, బాల్కొండ రూట్లో జై వీర్ తేజ దాబా వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

A-1 బంక చందన, A-2 ఉమర్ షేక్ సుల్తాన్, A-3 సయ్యద్ అలియా మహబూబ్, A-4 షేక్ అసియా ఫాతిమా, A-5 హఫీజ్‌లపై కేసు నమోదు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున బంగారం, లక్ష రూపాయల నగదు, వారి సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ భాస్కర్ అభినందించారు.

Trending News